Nepal Crisis: నేపాల్ ప్రస్తుతం తీవ్ర గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం తర్వాత చెలరేగిన జనరల్ జెడ్ విప్లవం ప్రభుత్వాన్ని కూలదోసింది. అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమం కారణంగా.. నేపాల్ వీధుల్లో హింస, అల్లర్లు, అనిశ్చితితో నెలకొన్నాయి. దీని అతిపెద్ద ప్రభావం ఉపాధి కోసం నేపాల్ నగరాలు, పట్టణాలకు వెళ్లి.. పనిచేస్తున్న భారతీయ కార్మికులపై పడింది. రోజు రోజుకూ పరిస్థితి దిగజారడంతో కార్మికులు భారత్ కు కాలినడకన తిరిగి రావడం ప్రారంభించారు.