Site icon NTV Telugu

Sandeep Lamichhane: అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచానేకు 8 ఏళ్ల జైలు శిక్ష..

Sandeep Lamichhane

Sandeep Lamichhane

అత్యాచారం కేసులో నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచానేకు 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. లామిచానే.. నేపాల్ క్రికెట్ జట్టుకు మాజీ కెప్టెన్ గా వ్యవహరించగా, ఐపీఎల్ రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. మీడియా కథనాల ప్రకారం.. అత్యాచారం కేసులో క్రికెటర్ సందీప్ లామిచానేకు నేపాల్ కోర్టు బుధవారం ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది.

Amarnath: నా భవిష్యత్తు జగన్ నిర్ణయిస్తారు.. నాకు ఎలాంటి గాభరా లేదు

లామిచానే అత్యంత ఉన్నత స్థాయి క్రికెటర్. అంతేకాకుండా నేపాల్ దేశం నుంచి ఐపీఎల్ లో ఆడిన మొదటి క్రికెటర్. అతను 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున తన మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. అదే ఏడాది ఆగస్టులో ఖాట్మండులోని ఓ హోటల్ గదిలో సందీప్ తనపై అత్యాచారం చేశాడని.. 17 ఏళ్ల బాలిక ఆరోపించడంతో నేపాల్ పోలీసులు అక్టోబర్ 6న త్రిభువన్ ఎయిర్ పోర్ట్ లో అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో లామిచానే దోషిగా నిర్ధారించారు. లామిచానే ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. అయితే.. జనవరి 12న పటాన్ హైకోర్టు అతన్ని విడుదల చేయాలని ఆదేశించింది. అందుకోసం.. లామిచానే రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. షరతులతో కూడిన రూ.20 లక్షల పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించారు.

Shweta K Sugathan: రిపబ్లిక్ డే రోజున “మహిళా పోలీస్ మార్చ్‌”కి స్వేత కే సుగతన్ నాయకత్వం.. ఈమె ఎవరో తెలుసా..?

లెగ్ స్పిన్నర్ లామిచానే.. ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, CPLతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన టీ20 లీగ్‌లలో ఆడాడు. అంతేకాకుండా.. ప్రపంచంలోనే వన్డేల్లో 50 వికెట్లు తీసిన రెండో అత్యంత స్పిన్ బౌలర్‌గానూ, టీ20ల్లో 50 వికెట్లు తీసిన మూడో స్పిన్ బౌలర్‌గానూ నిలిచాడు. కాగా.. గతేడాది ఆగస్టులో కెన్యాతో నేపాల్ తరఫున లామిచానే తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు.

Exit mobile version