Site icon NTV Telugu

YCP: రేపు సీఎం జగన్తో నెల్లూరు నేతల భేటీ..

Nellore

Nellore

నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను వైసీపి అధిష్టానం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో నరసరావు పేటకు అనిల్ కుమార్ వెళితే.. నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి పేరును తెరపైకి తెస్తున్నారు వైసీపీ నేతలు.

Read Also: Tragedy: ఏపీలో విషాదం.. కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి

కాగా.. అనిల్ కుమార్ యాదవ్ మాత్రం.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని ప్రతిపాదిస్తున్నారు. మరోవైపు.. రాష్ట్ర సేవా దళ్ అధ్యక్షుడు సుధీర్ కుమార్ రెడ్డి, వైసీపీ నేత సన్నపురెడ్డి పెంచల్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే స్థానాన్ని ఎవరికి కేటాయించాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో.. రేపు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయనికి నెల్లూరు జిల్లా నేతలు క్యూ కట్టనున్నారు. ఆ స్థానంపై ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయి చర్చించనున్నారు. రేపు జరగబోయే ఆ సమావేశంలో నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Read Also: CPI Narayana : వచ్చే నెల 2, 3 తేదీల్లో తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలు

Exit mobile version