డిప్యూటీ సీఎం అనే పదానికి జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ వన్నెతెచ్చారు గానీ.. పవన్ గారికి డిప్యూటీ సీఎం పదవి వల్ల ప్రత్యేక చరిష్మా రాలేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల అంటున్నారు. గత సంవత్సరాల అనుభవంలో డిప్యూటీ సీఎంలుగా ఎవరున్నారో తనతో పాటు చాలామందికి తెలియని పరిస్థితి అని, ఈ రోజున దేశం మొత్తం ఏపీ డిప్యూటీ సీఎం గురించి చర్చిస్తున్నారన్నారు. ఇంతితై వటుడింతై వామన రూపంలో మహావిష్ణువు ఎదిగినట్టు.. పవన్ కళ్యాణ్ గారు మరింత ఎదుగుతున్నారని కిషోర్ గునుకుల పేర్కొన్నారు.
Also Read: Chaudhary Elephant Attack: ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి మృతి.. గజరాజుల జాడ కోసం గాలింపు!
కావలిలో జనసేన జెండా ఆవిష్కరణలో కిషోర్ గునుకుల పాల్గొన్నారు. కావలి నియోజకవర్గపు జనసేన ఇంచార్జ్ అలహరి సుధాకర్, దగదర్తి మండల ప్రెసిడెంట్ వెంకట్ యాదవ్ ఆధ్వర్యంలో తురిమెర్ల గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ‘తాగునీరు ప్రతి ఒక్కరి హక్కు అని ప్రశ్నించిన గొంతుక ఈ రోజు అందరికీ తాగు నీరందించే పనిలో ఉంది. పల్లెలు అభివృద్ధి పడాలంటే.. పల్లె నుంచి నగరానికి కనెక్టివిటీ రోడ్లు వేయాలని ప్రశ్నించిన గొంతుక ఈ రోజు తండాలకు సైతం రోడ్లు వేయిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది. విశాఖ హుక్కు ఆంధ్రుడి హక్కు అని నినదించిన స్వరం ఈ రోజు ప్రైవేటీకరణ కాకుండా విశాఖ ఉక్కు కర్మాగారంకు కోట్ల రూపాయలు విడుదల చేయించి జాతికే గర్వకారణంగా నిలిచింది. వారి ఆశయ సాధనకు పనిచేస్తున్న జనసేన నాయకులు అందరూ కూడా జవాబు దారి కలిగి ఉన్నారని, ప్రజా సమస్యల పరిష్కార వారదులుగా పని చేస్తున్నారు’ అని కిషోర్ గునుకుల పేర్కొన్నారు.