BigBoss Neha Chowdary: బిగ్‌బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన జిమ్నాస్టిస్ట్ కమ్ యాంకర్ నేహా చౌదరి పెళ్లి చేసుకోబోతుంది. నేహా చౌదరి సినీ, క్రీడా రంగంలో తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆమె చలాకీ తనంతో తెలుగు ఫ్యామిలీస్ కు చాలా క్లోజయింది. యాంకరింగ్ పై అభిమానంతో పలు షోలకు యాంకరింగ్ చేసింది. తిరుపతి అమ్మాయి అయిన నేహా రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో నేషనల్ ఛాంపియన్ గా గోల్డ్ మెడల్ అందుకుంది. గతకొన్ని రోజులుగా నేహా పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ ఎంట్రీ సమయంలో కూడా నాగార్జునతో ‘బిగ్‌బాస్ షోకి వెళ్లొచ్చాక పెళ్లి చేసుకుంటా అని ఇంటిలో వాళ్లకి చెప్పి వచ్చాను’ అంటూ వెల్లడించింది. ఈ క్రమంలో ‘ఐ సేడ్ ఎస్’ అంటూ యూట్యూబ్ కి సంబంధించిన లింక్ ని జతచేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ చూశాక నేహా పెళ్లి వార్తలకు బలం చేకూరినట్లయింది. యూట్యూబ్ లో ‘అలా నేహాతో’ అనే ఒక బ్లాగ్ రన్ చేస్తుంది. ఆ బ్లాగ్ లో ‘నా పెళ్లి గోల మొదలైంది’ అంటూ ఒక వీడియో చేసి తన కాబోయే వరుడుని రెవీల్ చేసింది. ఇంజనీరింగ్ క్లాస్ మేట్ .. 13ఏండ్ల నుంచి స్నేహితుడైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఆమె శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజెన్లు.
https://www.youtube.com/watch?v=XfYh6MJN1u8&t=1487s&ab_channel=AlaNehaTho