NTV Telugu Site icon

GWMC : జీడబ్ల్యూఎంసీ పాత భవనం కూల్చివేతలో అధికారుల నిర్లక్ష్యం

Gwmc

Gwmc

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు తెలంగాణలో పలు జిల్లాల్లో వరదలు సంభవించాయి. ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో వరదలు భీభత్సం సృష్టించాయి. వరంగల్‌ జిల్లాలోని పలు లింక్‌ రోడ్లు వరదల ధాటికి తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా.. శిథిలావస్థకు చేరుకున్న కొన్ని భవనాలు సైతం వరదల దెబ్బకు నేలకూలాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే పాతభవనాలను కూల్చివేసేందుకు పూనుకుంది అధికార యంత్రాంగం. అయితే.. ఈ క్రమంలోనే గ్రేటర్‌ వరంగల్‌ మన్సిపల్‌ కార్పొరేషన్‌ పాల భవనాన్ని కూల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

Spinach Benefits: పాలకూరను తినండి.. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టండి!

కానీ. జీడబ్యూఎంసీ పాత భవనం కూల్చివేతలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. భవనం లోపల సామాగ్రిని ఖాళీ చేయకుండానే సిబ్బంది జీడబ్ల్యూఎంసీ భవనాన్ని కూల్చివేసింది. దీంతో భవనం లోప ఉన్న మిషన్‌ భగీరథ పైపులు, ఫర్నీచర్‌, ఇనుప రేకులు, ఫ్యాన్లు ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నా సిబ్బందిపై చర్యలు తీసుకోవడం లేదంటున్నారు స్థానికులు.

Budameru: బుడమేరు ఉగ్రరూపం.. రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం..

Show comments