NEET Aspirant Suicide: మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. చివరి వీడియోలో భావోద్వేగ మాటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET Aspirant Suicide: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ విజయ్‌నగర్ పరిధిలో గుండెల్ని పిండేసే మరో విషాదకర ఘటన వెలుగుచూసింది. నీట్ (NEET) పరీక్షకు ప్రిపేర్ అవుతున్న జతిన్ కుమార్ అనే 22 ఏళ్ల విద్యార్థి మానసిక ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. జతిన్ తన తల్లిదండ్రులకు ఉన్న ఒకే ఒక్క కుమారుడు. కాగా, అతని తండ్రి రాజేష్ కుమార్ సహారన్పూర్లో ఫుడ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెడికల్ సీటు సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తున్న జతిన్‌కు 2026 మే నెలలో జరిగిన నీట్ పరీక్ష ఐదో ప్రయత్నం. ఆ పరీక్ష ముగిసినప్పటికీ, మళ్లీ జరగబోయే నీట్ పరీక్ష కోసం అతను విజయ్‌నగర్ సెక్టార్-9లోని తన గదిలో ఉంటూ తిరిగి ప్రిపరేషన్ సాగిస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయం వరకు తన గదిలో చదువుకుంటూనే ఉన్నాడు. అయితే, శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు అతడిని నిద్ర లేపడానికి గదిలోకి వెళ్లేసరికి జతిన్ నిర్జీవంగా ఫ్లోర్‌పై పడి ఉండటం చూసి తల్లడిల్లిపోయారు. ఉరివేసుకున్న సమయంలో ఫ్యాన్‌కు కట్టిన తాడు తెగిపోవడంతో మృతదేహం కింద పడినట్లు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సిటీ కొత్వాలీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఉపాసన పాండే, విజయ్‌నగర్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఈ దర్యాప్తులో జతిన్ మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, అర్ధరాత్రి 12 గంటల సమయంలో అతను రికార్డ్ చేసిన ఒక నిమిషం ఐదు సెకన్ల నిడివి గల భావోద్వేగ భరిత వీడియో లభ్యమైంది. ఆ వీడియోలో ఫ్యాన్‌కు వేసిన ఉరితాడును చూపిస్తూ.. “నాన్నగారేమో అస్సలు టెన్షన్ పడొద్దని చెబుతున్నారు, నిజానికి నాకు కూడా ఎలాంటి టెన్షన్ లేదు. కానీ, వీటన్నింటి వల్ల నా మనసు పూర్తిగా విసిగిపోయింది. నేను జీవితంలో ఏదైనా భిన్నంగా చేయాలనుకుంటున్నాను” అంటూ జతిన్ తన చివరి మాటలను రికార్డ్ చేశాడు. ప్రస్తుతం పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేయించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఈ పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు ఈ ఘటనపై మాట్లాడటానికి నిరాకరించారు.
Also Read
- Delhi: జనరల్ బోగీలో సీటు కోసం హత్య.. ప్రేక్షకపాత్ర వహించిన ఆర్పీఎఫ్ సిబ్బంది!
- Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్..
- Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
- NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!
తాజావార్తలు
-
NEET Aspirant Suicide: మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. చివరి వీడియోలో భావోద్వేగ మాటలు..
-
Ma Inti Bangaram OTT Update : ‘మా ఇంటి బంగారం’ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ రివీల్
-
UK Grooming Gangs: 2,50,000 మంది అమ్మాయిలపై గ్రూమింగ్ గ్యాంగ్స్ దారుణాలు.. బ్రిటన్‌లో అసలేం జరిగింది?
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Delhi: జనరల్ బోగీలో సీటు కోసం హత్య.. ప్రేక్షకపాత్ర వహించిన ఆర్పీఎఫ్ సిబ్బంది!
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!