Site icon NTV Telugu

Neeraj Chopra: పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. ఫోటోలు వైరల్

Neeraj Chopra

Neeraj Chopra

భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా ఆదివారం వివాహం చేసుకున్నారు. అతను తన కుటుంబంతో కలిసి కనిపించిన వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నీరజ్ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ట్విట్టర్ లో పెళ్లి ఫోటోలను పోస్ట్ చేశారు. దానికి నీరజ్-హిమాని అని క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాకుండా.. “జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను” అని రాశారు.

Read Also: CM Chandrababu: ముఖ్యమంత్రి దావోస్‌కు పయనం.. ఆల్ ది బెస్ట్ చెప్పిన అధికారులు

పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రాను జావెలిన్ త్రోలో ప్రపంచంలోనే అత్యుత్తమ పురుష అథ్లెట్‌గా అమెరికన్ మ్యాగజైన్ ‘ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్’ 2024లో ప్రకటించింది. 2024 ఒలింపిక్ గేమ్స్‌లో పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన నీరజ్.. కాలిఫోర్నియాకు చెందిన మ్యాగజైన్ 2024 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను 89.45 మీటర్లు విసిరాడు. నీరజ్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ జావెలిన్ 92.97 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని సాధించాడు.

Read Also: Sambhal violence: సంభాల్ హింసలో మరో 10 మంది అరెస్ట్.. దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధం..

గతంలో నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. నీరజ్ పెళ్లి కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. సోషల్ మీడియా నుంచి ఇంటర్వ్యూల వరకు పెళ్లి గురించి ప్రశ్నలు అడిగారు. అయితే పెళ్లిపై నీరజ్ ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. తాజాగా.. ఈరోజు పెళ్లి చేసుకుని తన అభిమానులను ఆశ్చర్యపరిచారు.

Exit mobile version