దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల వేడి ఇప్పుడే రాజుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓడించాలని ప్రతిపక్షాలన్నీ కంకణం కట్టుకుని ఒక్కతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే సమయంలో ప్రతిపక్షాల ఐక్యతా సమావేశానికి ధీటుగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో రేపు ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరుగునుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఈ సమావేశానికి 38 పార్టీలు హాజరవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ తొమ్మిది సంవత్సరాలలో ఎన్డీయే గ్రాఫ్ బాగా పెరిగిందని తెలిపాడు. దేశంలో మంచి పాలన, దేశాభివృద్ధి ఎన్డీయేతోనే సాధ్యం అయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బలమైన నాయకత్వంలో 9 ఏళ్లలో దేశాభివృద్ధిని అందరూ చూస్తున్నారు.
Read Also: Opposition Parties Meeting: బెంగళూరులో విపక్ష పార్టీ నేతల సమావేశం
ఎన్డీయే కూటమి అధికారం కోసం కాదు దేశ సేవ కోసం పని చేస్తుంది అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఎన్డీయే మిత్రపక్షాల ది బావ సారూప్యతతో కూడిన ఐక్యత.. ఎన్డీయే కూటమితో దేశాన్ని మరింత బలంగా చెయ్యడమే మా లక్ష్యం అని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల కూటమిపై జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతిపక్షాల కూటమిలో నేతలు ఉన్నారు కానీ నీతి లేదు.. ప్రతిపక్షాల సమావేశం కేవలం ఫొటో దిగడానికి బాగుంటుంది అని ఆయన కామెంట్స్ చేశారు. 10 ఏళ్ల యూపీఏ పాలన అవినీతితో కూడింది.. దేశ హితం కోసమే ఎన్డీయే కూటమి పని చేస్తుంది అని తెలిపారు.
Read Also: Lal Darwaza Rangam : నాకు సంతోషంగా ఉంది.. నాకు కావాల్సిన పూజలన్ని అందిస్తున్నారు
ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం చేస్తున్నామని బీజేపీ జాతీయ అధినేత జేపీ నడ్డా అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తామని తెలిపారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ కూడా ఎన్డీయే కూటమి సమావేశానికి పిలుపునిచ్చి.. ఎన్నికలకు సమరశంఖాన్ని పూరిస్తుంది అని నడ్డా అన్నారు. మోడీ ప్రభుత్వ పథకాలు, విధానాల సానుకూల ప్రభావం కారణంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఉత్సాహంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
