NTV Telugu Site icon

NDA Alliance: ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ..!

Nda

Nda

NDA Alliance: నేడు భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కొత్తగా ఎన్నికైన ఎంపీలతో సమావేశం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరగనుంది. ఈ మీటింగ్ లో మహా కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై సుధీర్ఘ చర్చ జరుగుతుంది.. అలాగే, పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోడీని ఎన్నుకునేందుకు ఈ భేటీ జరగనుంది. ఇక, కొత్త ఎంపీలను ఉద్దేశించి ఈ సందర్బంగా ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఎన్డీయేలోని మిత్రపక్షాలతో కలిసి మోడీ రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు.

Read Also: Prajavani: నేటి నుంచి ప్రజావాణి పునఃప్రారంభం..

అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 293 సీట్లు గెలుచుకుని మెజారిటీ మార్కును అధిగమించింది. అయితే, 2019తో పోలిస్తే సొంతంగా బీజేపీ కేవలం 240 సీట్లు మాత్రమే సాధించగలిగింది. కాగా, అంతకుముందు బుధవారం ఎన్‌డీఎలో చేరిన పార్టీల నేతలు సమావేశమై తమ నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ భేటీలో ఐదుగురు ఎంపీలు ఉన్న పార్టీకి ఒక మంత్రి పదవిని ఇచ్చే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ మంది ఉన్న జేడీయూ, టీడీపీ పార్టీలకు మూడు మంత్రి పదవులు ఇవ్వవచ్చు అనే సమాచారం అందుతుంది. అయితే, ఈ పార్టీలు నాలుగు మంత్రి పదవులు డిమాండ్ చేశాయని, టీడీపీ కూడా లోక్‌సభ స్పీకర్ పదవిని డిమాండ్ చేసిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ డిమాండ్లను రెండు పార్టీలు అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇక, బీజేపీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ రెండు పార్టీలు ఇంకా ఎలాంటి డిమాండ్ చేయలేదంటున్నారు.