NTV Telugu Site icon

Sharad Pawar: కేంద్రం నుంచి నాకు ఆహ్వానం అందలేదు: శరద్‌ పవార్‌

Sharad Pawar

Sharad Pawar

NCP Chief Sharad Pawar Said I has not received an invitation of Ram Temple Inauguration: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవానికి తనకు కేంద్రం నుంచి ఆహ్వానం అందలేదని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రామ మందిరాన్ని ఉపయోగించుకుంటుందో లేదో చెప్పడం కష్టమన్నారు. ఏదేమైనా రామాలయం ఏర్పడైనందుకు చాలా సంతోషిస్తున్నట్లు శరద్ పవార్ తెలిపారు. రామ మందిర ప్రారంభోత్సవానికి శరద్‌ పవార్‌ దూరం కానున్నట్లు వార్తలు రాగా.. ఈ విషయంపై ఆయన స్పష్టతనిచ్చారు.

Also Read: Crime News: పరువు హత్య.. కూతురుని గడ్డివాములో వేసి కాల్చేసిన తండ్రి!

2024 జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు సహా ప్రముఖులకు కేంద్రం ఆహ్వానం పంపింది. అయితే రామ మందిర ప్రారంభోత్సవానికి శరద్‌ పవార్‌ దూరం కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రామాలయ ప్రారంభోత్సవానికి మీరు వెళుతున్నారా? అని విలేకరులు అడగ్గా.. ప్రారంభోత్సవానికి తనకు కేంద్రం నుంచి ఆహ్వానం అందలేదని శరద్‌ పవార్‌ సమాధానమిచ్చారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ కార్యక్రమానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది.

Show comments