NTV Telugu Site icon

Sachin Kurmi: ఎన్సీపీ నేత దారుణ హత్య.. ఉద్రిక్తత వాతావరణం

Sachin Kurmi

Sachin Kurmi

Sachin Kurmi: మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NSP) నాయకుడు సచిన్ కుర్మీ గత రాత్రి ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో హత్యకు గురయ్యారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో సచిన్‌ను హత్య చేశారు. కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ జరుపుతున్నారు ముంబై పోలీసులు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు, రాజకీయ ఉద్రిక్తతలపై ఆందోళన నెలకొంది.

Also Read: Devara : ఇంతకీ ఎన్టీయార్ అన్నది ఎవరినుద్దేశించి.. ఇప్పుడిదే చర్చ..?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో జరిగింది. పోలీసులకు సమాచారం అందించిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలో సచిన్ కుర్మీ గాయపడ్డాడు. వెంటనే అతడిని పోలీసు వాహనంలో జేజే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. నేడు అతడికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.

Also Read: Harmanpreet Kaur: అంపైర్‌ నిర్ణయంపై కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫైర్..(వీడియో)

Show comments