NTV Telugu Site icon

NBK108: బాలయ్య సినిమా రిలీజ్ డేట్ లాక్..పోటీలో మూడు సినిమాలు..

Nbk108

Nbk108

నందమూరి హీరో బాలయ్య బాబు కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నాడు.. నా ఏజ్ నా కేరీర్ కు అడ్డురాదు అంటూ వరుస సినిమాలను చేస్తున్నాడు.. ఒక్క మాటలో చెప్పాలంటే కుర్ర హీరోలకు టార్గెట్ అవుతున్నాడు.. ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మరింత జోష్‌తో కనిపిస్తున్నారు. ఈ జోష్ తోనే ఈ సంక్రాంతికి గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాతో వచ్చారు. దీనికి కూడా భారీ స్పందన దక్కింది. ఫలితంగా ఇది అత్యధిక కలెక్షన్లను వసూలు చేయడంతో పాటు హిట్‌ అయింది. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలయ్య ప్రస్తుతం తన 108వ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు.

ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇలా ఇప్పటికే దాదాపు 90 శాతం వరకూ టాకీ పార్టును చిత్ర యూనిట్ కంప్లీట్ చేసుకుంది.. మిగిలిన భాగాన్ని త్వరగా పూర్తి చేసేలా డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడు.. అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకులకు ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు..ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ డేట్‌పై తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను ఈ ఏడాది దసరా పండుగ కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ఎప్పుడో డిసైడ్ అయింది. అందుకు అనుగుణంగానే ఈ విషయాన్ని ప్రకటించారు. ఇక, ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా బయటకు వచ్చింది.

ప్రస్తుత వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సినిమాను అక్టోబర్ 20న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తారట. ఈ విషయాన్ని టైటిల్ పోస్టర్‌లో రివీల్ చేస్తారని తెలిసింది..ఇక, అదే రోజున రవితేజ ‘టైగర్ నాగేశ్వర్రావు’, రామ్ పోతినేని – బోయపాటి శ్రీను సినిమా, విజయ్ ‘లియో’ సినిమాలు విడుదల కానున్నాయి.. దాంతో సినిమాకు గట్టి పోటి ఏర్పడింది.. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుంది. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయనున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి..