Site icon NTV Telugu

Nayanthara : సంచలన నిర్ణయం తీసుకున్న నయనతార..!!

Image 1680504053

Image 1680504053

సౌత్ ఇండస్ట్రీ లో అత్యధిక రెమ్యునరేషన్‌ అందుకుంటున్న హీరోయిన్లలో నయనతార కూడా ఒకరు. ఆమె లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈమె దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.నలభై ఏళ్ల వయస్సుకు దగ్గరవుతూ ఉన్న నయనతార.. పెళ్లి చేసుకున్నాక సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది. అయితే ఇప్పటికీ అదే అందం అదే ఫిట్‌నెస్‌తో లేడీ సూపర్‌ స్టార్‌గా వరుస సినిమాలను చేస్తుంది.అందంతో మాయ చేస్తున్న ఈ బ్యూటీ ఫిట్‌నెస్‌ రహస్యాలకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. నయనతార బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండటానికి కారణం జిమ్‌ వర్కౌట్స్‌ మరియు యోగా ముఖ్య కారణాలని తెలుస్తుంది. నయన్‌ క్రమం తప్పకుండా యోగాను చేస్తుంది.రోజూ రెండు గంటలు యోగా చేస్తుందని సమాచారం.. అలాగే ఈమె డైట్‌లో కచ్చితంగా కొబ్బరినీళ్లు మాత్రం ఉండాల్సిందేనట. ఉదయం అల్పాహారంలో పళ్ల రసంకచ్చితంగా ఉండాలి.పళ్లరసం బరువును తగ్గించడంతోపాటు ఎనర్జీ పెరగడానికి కూడా దోహదపడుతుంది.

ఇక మధ్యాహ్నం భోజనంలో మాంసాహారం, గుడ్డు,అలాగే కాయగూరలు సమానంగా తీసుకుంటుంది. ముఖ్యంగా కార్బో హైడ్రేట్స్‌ కలిగిన పదార్థాలకు ఆమె దూరంగా ఉంటారట. ఇక సరైన నిద్ర కూడా మన బరువును అదుపులో పెడుతుంది.నయన్‌ రోజుకు 8 గంటలు నిద్రపోయేలా తన షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసుకుంటారని తెలుస్తుంది.. నయనతార కొంతకాలం పాటు నటన కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు గా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చేతి లో ఉన్న సినిమాలను పూర్తిచేసిన తరువాత కొన్నాళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉంటారని సమాచారం.
పిల్లలను స్వయంగా తానే చూసుకోవడం కోసమే ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకుందని సమాచారం. ఇక నయనతార కొన్నాళ్ళ పాటు నటనకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా ఇటీవల వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తాను చేయాల్సిన సినిమాలను పూర్తిచేసిన తరువాత, కొంతకాలం పాటు సినిమాల ను పక్కన పెడుతుందని సమాచారం

Exit mobile version