NTV Telugu Site icon

Nayanthara-Vignesh Shivan: పదేళ్ల నయనతార.. రెండేళ్ల విక్కీ-నయన్!

Nayanthara Vignesh Shivan

Nayanthara Vignesh Shivan

Nayanthara and Vignesh Shivan Wedding: కోలీవుడ్‌ డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌, హీరోయిన్‌ నయనతార ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2015లో నయన్ హీరోయిన్‌గా నటించిన నానుమ్‌ రౌడీ దాన్‌ సినిమాకు విక్కీ దర్శకత్వం వహించాడు. ఇది తెలుగులో ‘నేను రౌడీ’ పేరుతో రిలీజైంది. ఆ సినిమా షూటింగ్‌లో ఏర్పడిన పరిచయం.. కొద్ది కాలానికే ప్రేమగా మారింది. ఏడేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన విక్కీ-నయన్.. 2022 జూన్‌ 9న పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సరోసగి ద్వారా ఇద్దరు కుమారులకు (ఉయిర్‌, ఉలగం) తల్లిదండ్రులయ్యారు.

Also Read: Katrina Kaif: రూమర్లకు చెక్.. కత్రినా కైఫ్ ఫొటోస్ వైరల్!

రెండో వివాహా వార్షికోత్సవం సందర్భంగా విఘ్నేశ్ శివన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ పోస్ట్ చేశారు. తన సతీమణి నయనతారతో కలిసి చిల్ అవుతోన్న వీడియోను పంచుకున్నారు. పదేళ్ల బంధం తమ మధ్య ఉందని విక్కీ పేర్కొన్నారు. ‘పదేళ్ల నయనతార, రెండేళ్ల విక్కీ-నయన్. ఇవాళ మా రెండో వివాహా వార్షికోత్సవం. నిన్ను పెళ్లి చేసుకోవడం.. ఉయిర్, ఉలగం రావడం నా జీవితంలోకి గొప్ప విషయం. నా భార్య తంగమేయిని చాలా ప్రేమిస్తున్నా. మరెన్నో ఆహ్లాదకరమైన సమయాలు, జ్ఞాపకాలు, విజయవంతమైన క్షణాలు ఉండాలని కోరుకుంటున్నా. జీవితంలో గెలుపోటములు, ప్రశంసలు, విమర్శలు అన్ని అంటాయి. ఏ పరిస్థితుల్లోనైనా నీకు తోడుగా ఉంటా. ఆ భగవంతుడు ఎల్లవేళలా మనకు అండగా నిలవాలని కోరుకుంటున్నా. మన ఉయిర్, ఉలగంతో సంతోషంగా ఉండాలనేదే నా ఆశయం. మన పెద్ద పెద్ద ఆశయాలు నెరవేరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని విఘ్నేశ్ రాసుకొచ్చారు.

Show comments