NTV Telugu Site icon

Haryana CM: హర్యానా సీఎంగా నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రమాణస్వీకారం!

Nayabsingh Saini Oath

Nayabsingh Saini Oath

Nayab Singh Saini Oath: హర్యానా నూతన సీఎంగా నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రమాణస్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం పంచకులలోని షాలిమార్ మైదానంలో జరిగిన వేడుకలో గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమి నేతలు హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా, నితిన్‌ గడ్కరీ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

హర్యానాలో అక్టోబర్ 8న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగా.. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ విజయం సాధించింది. 90 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లు గెలుచుకుని హ్యాట్రిక్ కొట్టింది. ఇక్కడ కాంగ్రెస్‌ 37 సీట్లకే పరిమితమైంది. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చిన నాయబ్‌ సింగ్ సైనీ వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపింది. బుధవారం జరిగిన శాసనసభా పక్ష భేటీలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Also Read: Miss India 2024: ‘మిస్‌ ఇండియా’గా నిఖిత పోర్వాల్‌!

శాసనసభా పక్ష భేటీలో మాజీ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, సీనియర్‌ నేత అనిల్‌ విజ్‌లు నాయబ్‌ సింగ్ సైనీ పేరును ప్రతిపాదించగా.. సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో హర్యానా సీఎంగా నేడు రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ స్థానంలో సీఎంగా సైనీ ఈ ఏడాది మార్చిలో మొదటిసారి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.