NTV Telugu Site icon

Aurangzeb Picture: వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా ఔరంగజేబు ఫొటో.. నవీ ముంబై వ్యక్తి అరెస్ట్!

Aurangzeb Picture

Aurangzeb Picture

Aurangzeb Picture: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చిత్రాన్ని తన వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగించుకున్నారనే ఆరోపణలపై నవీ ముంబై పోలీసులు ఒక వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ సమస్యను ఒక హిందూ సంస్థ లేవనెత్తిందని ఆదివారం ఒక అధికారి తెలిపారు. నిందితుడు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అవుట్‌లెట్‌లో పనిచేస్తున్నాడు.ఔరంగజేబ్ చిత్రాన్ని ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవడంపై హిందూ సంస్థ సభ్యుడు అమర్జీత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 298, 153 ఎ కింద నవీ ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని, ప్రశ్నించి విడుదల చేశారు.ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు.

Also Read: Karumuri Nageswara Rao: అమిత్‌షా కామెంట్లకు కారుమూరి కౌంటర్.. చెవిలో ఎవరో ఊదితే.. దాన్నే షా మాట్లాడారు..

ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టడంపై కొల్హాపూర్‌లో నిరసనలు చెలరేగాయి. పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్, టిప్పు సుల్తాన్‌లను కీర్తించడంపై మహారాష్ట్రలోని వివిధ నగరాల్లో మతపరమైన ఉద్రిక్తత సంఘటనలు చెలరేగాయి.ఔరంగజేబ్‌ను కీర్తిస్తూ, మరాఠా జాతీయ చిహ్నాన్ని అగౌరవపరిచేలా పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో నిరసనలకు దారితీసింది. కొల్హాపూర్ నగరంలోని కొన్ని మితవాద సంస్థల ప్రజలు జూన్ 7వతేదీన కొల్హాపూర్ బంద్‌నకు పిలుపునిచ్చారు.ఈ బంద్ హింసాత్మక నిరసనలకు దారితీసింది. మా మరాఠా భూమిపై మొఘల్ నాయకులను కీర్తించడాన్ని మేం సహించమని.. హిందూ సమాజం పరిరక్షణ కోసం కత్తులు దూసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ.. దీన్ని సహించేది లేదని అని హిందూ సంఘాల నేతలు ప్రకటించారు.

Also Read: Silvio Berlusconi: ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ కన్నుమూత

అంతకుముందు అహ్మద్‌నగర్‌లో ఊరేగింపులో ఔరంగజేబు ఫోటోలను ప్రదర్శించారు. సంగమ్‌నేర్ పట్టణంలో, బాలుడి హత్యకు ప్రతిగా సకల్ హిందూ సమాజ్ ర్యాలీలో రాళ్లు రువ్వబడ్డాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడగా, ఐదు వాహనాలు ధ్వంసమయ్యాయి. విడిగా, సంగమ్‌నేర్‌లో కూడా మతపరమైన ఊరేగింపు సందర్భంగా అభ్యంతరకరమైన నినాదాలతో ఔరంగజేబు పోస్టర్ ప్రదర్శించబడిందని పోలీసులు తెలిపారు.

Show comments