Naveen -ul-Haq: కోహ్లీతో గొడవపై నవీన్ ఉల్ హక్ క్లారిటీ.. తన తప్పేమీలేదన్న అఫ్గానిస్తాన్ ప్లేయర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naveen -ul-Haq: ఐపీఎల్-2023లో ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జేయింట్స్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కింగ్ విరాట్ కోహ్లి, ఆఫ్గానిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ గొడవలో లక్నో మెంటార్ గౌతం గంభీర్ జోక్యం చేసుకోవడంతో మరింత పెద్దదైంది. అయితే కోహ్లీ మాత్రం ఈ మ్యాటర్ ను అప్పుడే వదిలిపెట్టగా.. నవీన్ మాత్రం సోషల్ మీడియాలో విరాట్‌నే టార్గెట్ చేస్తూ వచ్చాడు. అయితే కోహ్లీ అభిమానులు మాత్రం ఆ ఆటగాడిని వదల్లేదు. నవీన్ ఎక్కడ కనిపించిన కోహ్లి కోహ్లి అంటూ గట్టిగా అరుస్తూ చుక్కలు చూపించారు.
అయితే ఈ వివాదంపై నవీన్ ఉల్ హక్ తాజాగా స్పందించాడు. తాను అసలు గొడవే పడలేదని, కోహ్లీనే గొడవ మొదలు పెట్టాడంటూ కీలక కామెంట్స్ చేశాడు.’ మ్యాచ్ సమయంలో విరాట్ అన్ని మాటలు అనకుండా ఉండాల్సింది. నేను ఈ గొడవను ప్రారంభించలేదు. మ్యాచ్ అనంతరం మేం షేక్‌హ్యాండ్స్ ఇచ్చేటప్పుడు కోహ్లి మళ్లీ గొడవను ప్రారంభించాడు. మాపై పడిన ఫైన్‌లు చూస్తే మీరు చూస్తే తప్పు ఎవరిదో అర్థం అవుతుంది. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను సాధారణంగా ఎవరినీ స్లెడ్జ్ చేయను అన్నాడు నవీన్.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఒక వేళ చేయాలనుకున్న నేను బౌలర్‌ను కాబట్టి బ్యాటర్‌లకు మాత్రమే చేస్తా. నేను అప్పటి పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నానో అక్కడ ఉన్న ఆటగాళ్లకు తెలుసు. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గానీ మ్యాచ్ తర్వాత గానీ సహనం కోల్పోలేదు. అక్కడ నా తప్పులేదని అందరికీ తెలుసు. నేనే షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కోహ్లినే నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. నేను కూడా మనిషినే కదా రియాక్ట్ అవ్వక తప్పలేదు’ అని నవీన్ ఉల్ హక్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!