NTV Telugu Site icon

Naveen -ul-Haq: కోహ్లీతో గొడవపై నవీన్ ఉల్ హక్ క్లారిటీ.. తన తప్పేమీలేదన్న అఫ్గానిస్తాన్ ప్లేయర్..!

Naeen

Naeen

Naveen -ul-Haq: ఐపీఎల్‌-2023లో ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జేయింట్స్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కింగ్ విరాట్‌ కోహ్లి, ఆఫ్గానిస్తాన్‌ పేసర్‌ నవీన్ ఉల్ హక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ గొడవలో లక్నో మెంటార్‌ గౌతం గంభీర్‌ జోక్యం చేసుకోవడంతో మరింత పెద్దదైంది. అయితే కోహ్లీ మాత్రం ఈ మ్యాటర్ ను అప్పుడే వదిలిపెట్టగా.. నవీన్‌ మాత్రం సోషల్‌ మీడియాలో విరాట్‌నే టార్గెట్‌ చేస్తూ వచ్చాడు. అయితే కోహ్లీ అభిమానులు మాత్రం ఆ ఆటగాడిని వదల్లేదు. నవీన్ ఎక్కడ కనిపించిన కోహ్లి కోహ్లి అంటూ గట్టిగా అరుస్తూ చుక్కలు చూపించారు.

అయితే ఈ వివాదంపై నవీన్‌ ఉల్‌ హక్‌ తాజాగా స్పందించాడు. తాను అసలు గొడవే పడలేదని, కోహ్లీనే గొడవ మొదలు పెట్టాడంటూ కీలక కామెంట్స్ చేశాడు.’ మ్యాచ్‌ సమయంలో విరాట్‌ అన్ని మాటలు అనకుండా ఉండాల్సింది. నేను ఈ గొడవను ప్రారంభించలేదు. మ్యాచ్ అనంతరం మేం షేక్‌హ్యాండ్స్‌ ఇచ్చేటప్పుడు కోహ్లి మళ్లీ గొడవను ప్రారంభించాడు. మాపై పడిన ఫైన్‌లు చూస్తే మీరు చూస్తే తప్పు ఎవరిదో అర్థం అవుతుంది. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను సాధారణంగా ఎవరినీ స్లెడ్జ్ చేయను అన్నాడు నవీన్.

ఒక వేళ చేయాలనుకున్న నేను బౌలర్‌ను కాబట్టి బ్యాటర్‌లకు మాత్రమే చేస్తా. నేను అప్పటి పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నానో అక్కడ ఉన్న ఆటగాళ్లకు తెలుసు. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గానీ మ్యాచ్ తర్వాత గానీ సహనం కోల్పోలేదు. అక్కడ నా తప్పులేదని అందరికీ తెలుసు. నేనే షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కోహ్లినే నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. నేను కూడా మనిషినే కదా రియాక్ట్ అవ్వక తప్పలేదు’ అని నవీన్ ఉల్ హక్ చెప్పుకొచ్చాడు.