Site icon NTV Telugu

Naveen Polishetty : మైత్రీ బ్యానర్‌లో నవీన్ నెక్స్ట్ మూవీ.. అంచనాలు మామూలుగా లేవు!

Naveenpolishety

Naveenpolishety

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ నవీన్ పొలిశెట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధించి, నవీన్ కెరీర్‌లోనే మొట్టమొదటి రూ. 100 కోట్ల మైలురాయిని అందుకుంది. ఎటువంటి భారీ హంగులు లేకుండా, కేవలం కంటెంట్.. తనదైన నటనను నమ్ముకుని ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ అద్భుత విజయం నవీన్‌ను టాలీవుడ్ టాప్ లీగ్ హీరోల సరసన నిలబెట్టడమే కాకుండా, ఆయన స్టార్ పవర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

Also Read : Jayaram : ‘అల వైకుంఠపురములో’ షూటింగ్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ బయటపెట్టిన జయరామ్

నవీన్ పొలిశెట్టి సాధించిన ఈ భారీ విజయానికి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రత్యేక అభినందనలు తెలిపింది. అంతటితో ఆగకుండా, తమ తదుపరి ప్రతిష్టాత్మక చిత్రంలో నవీన్ పొలిశెట్టి నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఇచ్చింది. ‘ఈ ప్రాజెక్ట్ కోసం మేం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అంటూ మైత్రీ మేకర్స్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన మైత్రీ బ్యానర్.. ఎనర్జిటిక్ స్టార్ నవీన్ కాంబో అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమా కచ్చితంగా ఒక వెరైటీ సబ్జెక్టుతో కూడిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నవీన్, ఈ భారీ నిర్మాణ సంస్థతో కలిసి మరిన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Exit mobile version