MLA Kotamreddy: ప్రేమిస్తే పోయేదేమి లేదు డ్యూడ్.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు! ఎమ్మెల్యే ట్వీట్ వైరల్
- వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోస్టర్లు
- బాగా ఫేమస్ అయిన 'రప్పా.. రప్పా నరుకుతాం
- జగన్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Kotamreddy’s Tweet Goes Viral Amid Political Dialogue War: ఇటీవలి రోజుల్లో ‘రప్పా.. రప్పా నరుకుతాం’ అనే డైలాగ్ ఏపీ రాజకీయాల్లో బాగా ఫేమస్ అయింది. ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ‘రప్పా.. రప్పా నరుకుతాం’ అనే పోస్టర్లు కార్యకర్తలు పెట్టడం, వాటిని వైసీపీ అధినేత సమర్ధించడం జరిగింది. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కూడా మరోసారి జగన్ స్పందించారు. సినిమాలోని డైలాగునే తమ వాళ్లు పోస్టర్లుగా ప్రదర్శించారని.. ఇదేమైనా తప్పా? అంటూ ప్రశ్నించారు. డైలాగులు నచ్చకపోతే సినిమాలోనూ లేపేయండని, సెన్సార్ బోర్డు ద్వారా ఎందుకు అనుమతించారని ఎదురుదాడికి దిగారు. నందమూరి బాలకృష్ణ సినిమాల్లో డైలాగ్‌లు ఇంతకంటే దారుణంగా ఉంటాయని జగన్ వ్యాఖ్యానించారు.
Also Read: Bojjala Sudhir Reddy: దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నా.. వినూత ఘటనలో నా ప్రమేయం లేదు!
Also Read
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ కౌంటర్ వేశారు. ప్రేమిస్తే పోయేదేమి లేదు డ్యూడ్.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అని పేర్కొన్నారు. ‘రప్పా రప్పా నరుకుతాం.. ఏందయ్యా ఇది?. దారి తప్పిన వాళ్ల డైలాగ్. ప్రేమిస్తే పోయేదేమి లేదు డ్యూడ్, మహా అయితే వాళ్లు మనల్ని తిరిగి ప్రేమిస్తారు. ఇది రాష్ట్రాన్ని దారిలో పెట్టి ఆచరించే పార్టీ డైలాగ్. తేడా ఇక్కడే ఉంది సోదరా.. తెలుసుకో’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటంరెడ్డి ట్వీట్ వైరల్ అయింది.
రప్పా రప్పా నరుకుతాం. ఏందయ్యా ఇది? దారితప్పిన వాళ్ళ డైలాగ్.
ప్రేమిస్తే పోయేదేమి లేదు డ్యూడ్. మహా అయితే వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమిస్తారు.ఇది రాష్ట్రాన్ని దారిలో పెట్టి ఆచరించే పార్టీ డైలాగ్.
తేడా ఇక్కడే ఉంది సోదరా! తెలుసుకో!
— Kotamreddy Sridhar Reddy (@kotamreddy_NLR) July 17, 2025
తాజావార్తలు
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!