NTV Telugu Site icon

Love Mouli Trailer: నవదీప్‌ ‘లవ్‌ మౌళి’ ట్రైలర్‌.. బోల్డ్‌ కంటెంట్‌ బోలెడుంది!

Love Mouli Trailer

Love Mouli Trailer

Navdeep’s Love Mouli Movie Trailer Out: అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్‌ హీరోగా చేసిన సినిమా ‘లవ్‌ మౌళి’. నైరా క్రియేషన్స్‌, శ్రీకర స్టూడియోస్‌ పతాకాలపై సి స్పేస్‌ సంస్థ ఈ చిత్రంను నిర్మించింది. ఈ సినిమాలో పంఖురి గిద్వానీ హీరోయిన్‌గా నటించగా.. భావన సాగి, మిర్చి హేమంత్‌, మిర్చి కిరణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 19న లవ్‌ మౌళి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తోంది. ఇందులో భాగంగా నేడు లవ్‌ మౌళి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

హీరో తాడు సాయంతో జలపాతం పైకి ఎక్కుతున్న సన్నివేశంతో లవ్‌ మౌళి ట్రైలర్‌ ఆరంభం అయింది. ‘పట్టపగలు కూడా వెలుతురు పడని ఈ గుహ లాంటి గుండె నాది’, ‘ఏం చేస్తున్నామో చూసి ప్రేమిస్తారు.. ఎంత సంపాదిస్తాన్నామో చూసి పెళ్లి చేసుకుంటారు.. దీంట్లో లవ్ ఎక్కడుంది’, ‘నాకు ఎలాంటి అమ్మాయి కావాలో నాకు తెలియపోవడం ఏంటి?’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. నాలుగు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్‌లో బోల్డ్‌ కంటెంట్‌ బోలెడుంది.

Also Read: Mahesh Babu-Venkatesh: చిన్నోడితో కలిసి పెద్దోడి బిజినెస్.. ‘ఏఎంబీ విక్టరీగా’ థియేటర్!

ప్రేమ అనేది లేకుండా మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి.. ప్రేమ దొరికితే ఎలా ఉంటుంది? అనే కోణంలో లవ్‌ మౌళి చిత్రాన్ని తెరకెక్కించారు. మనుషులతో ఎలాంటి పరిచయం లేని వ్యక్తికి.. ప్రేమించే వ్యక్తి దొరికితే ఎలా మారతాడు? అనే విషయాన్ని బోల్డ్‌గానే చెప్పినట్లు ఉంది. 2021లో ప్రారంభమైన లవ్‌ మౌళి సినిమా.. కరోనా సమయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొని ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుంది. చాలా రోజుల తర్వాత సోలో హీరోగా నవదీప్‌ ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంపై నవదీప్‌ భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

Show comments