టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయిన స్టార్ హీరోగా అతి తక్కువ కాలంలోనే ఎదిగాడు.. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, సెకండ్ హీరోగా మారి ఆ తర్వాత హీరోగా వరుస సక్సెస్ లు కొట్టి న్యాచురల్ స్టార్ గా ఎదిగాడు. మామూలు హీరో నుంచి 100 కోట్ల కలెక్షన్స్ అందుకొనే స్థాయికి నాని ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు..
ఇటీవల నాని పుట్టినరోజు సందర్బంగా ఆయన నెక్స్ట్ సినిమాల నుంచి అప్డేట్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.. తాజాగా టాలీవుడ్ లో నాని సినిమాల లైనప్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నాని మొదటి నుంచి కూడా సినిమా సినిమాకి కథల్లో వేరియేషన్స్ చూపిస్తూ వస్తున్నాడు.. గత ఏడాది బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన దసరా లాంటి మాస్ సినిమాలో నటించిన నాని.. అదే ఏడాది హాయ్ నాన్నతో ఎమోషనల్ క్లాసిక్ హిట్ కొట్టాడు.. నాని చేతిలో ప్రస్తుతం అర డజనుకు పైగా సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది.. ఎవరితో ఏ సినిమా చేస్తున్నాడంటే..
సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాని. ఈ సినిమా రజినీకాంత్ భాష స్టయిల్లో ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాని కూడా DVV ఎంటర్టైన్మెంట్ నిర్మించడం విశేషం.. ఆ తర్వాత బలగం వేణు తో ఓ సినిమా చేయబోతున్నాడు..దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నారు నాని. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఇంకో సినిమా ఉంటుందని గతంలో ప్రకటించాడు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నాని సినిమా ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. అలాగే ఓ తమిళ్ డైరెక్టర్ తో కూడా నాని సినిమా ఉండబోతుందని సమాచారం.. ఆ సినిమాలన్ని హిట్ అయితే తిరుగుండదని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు..