Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Natural Home Remedy: ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు నెరవడం చాలా మందిని ఆందోళనకు గురి చేస్తోంది. ఒత్తిడి, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, కెమికల్ ఉత్పత్తుల అధిక వినియోగం వల్ల జుట్టు త్వరగా తెల్లబడుతోంది. దీంతో చాలామంది హెయిర్ డైలు, కెమికల్ కలర్స్ వాడుతుండడంతో.. అవి జుట్టుకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. అయితే సహజంగా జుట్టు రంగును మెరుగుపరచాలనుకునేవారికి ఒక సింపుల్ హోమ్ రెమెడీ మంచి పరిష్కారంగా మారుతోంది.
కొబ్బరి నూనె, కాఫీ పొడి, నిమ్మరసం కలిపి తయారు చేసే ఈ నేచురల్ మిక్స్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా జుట్టు నెరవడాన్ని తగ్గించడంలో, సహజమైన రంగును క్రమంగా మెరుగుపరచడంలో ఇది ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రెమెడీలో ఉపయోగించే కొబ్బరి నూనె జుట్టుకు పోషణ అందించి హెయిర్ రూట్స్ ను బలపరుస్తుంది. కాఫీ పొడిలో ఉండే సహజ రంగు జుట్టుకు డార్క్ టోన్ ఇవ్వడంలో సహాయపడుతుంది. నిమ్మరసం తల చర్మాన్ని శుభ్రపరచి హెయిర్ గ్రోత్‌కు ఉపయోగపడుతుంది.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్‌కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
కావాల్సిన పదార్థాలు:
* 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె
* 1 టేబుల్ స్పూన్ గ్రౌండ్ కాఫీ పొడి
* అర్ధ నిమ్మకాయ రసం
తయారీ విధానం:
మొదట ఒక చిన్న గిన్నెలో కొబ్బరి నూనె తీసుకోవాలి. అందులో గ్రౌండ్ కాఫీ పొడి వేసి బాగా కలపాలి. తర్వాత అర్ధ నిమ్మకాయ రసం జోడించి మూడు పదార్థాలను పేస్ట్‌లా అయ్యే వరకు మిక్స్ చేయాలి. జుట్టు పూర్తిగా డ్రైగా ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని రూట్స్ నుంచి హెయిర్ ఎండ్స్ వరకు అప్లై చేయాలి. అలా మెల్లగా మసాజ్ చేస్తూ తలకు పట్టించాలి. దాదాపు 30 నిమిషాల వరకు అలాగే ఉంచాలి. కావాలంటే గంట వరకు కూడా ఉంచవచ్చు. ఆ తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ రెమెడీని వారానికి ఒకసారి ఉపయోగిస్తే కొన్ని వారాల్లో జుట్టులో మార్పు కనిపించే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా మారడంలో కూడా సహాయపడుతుంది. అయితే ఇది పూర్తిగా సహజ రెమెడీ కాబట్టి.. ఫలితాలు ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉండకపోవచ్చు. మీకు ఏదైనా అలర్జీ సమస్యలు ఉంటే ముందుగా పాచ్ టెస్ట్ చేయడం మంచిది. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?