NTV Telugu Site icon

Naatu Naatu Song Shortlisted For Oscar Awards: ఆస్కార్ షార్ట్ లిస్టులో ట్రిపుల్ఆర్ నాటు నాటు సాంగ్

Naatu Naatu

Naatu Naatu

Naatu Naatu Song Shortlisted For Oscar Awards: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటింది. అత్యంత భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్లతో రూపొందిన ఈ చిత్రం తెలుగు సహా పలు భారతీయ భాషల్లో సత్తా చాటింది. అంతటితో ఆగకుండా చైనా, జపాన్, యూఎస్ ప్రేక్షకులను కూడా మెప్పించింది. ఇంతలా విజయాన్ని దక్కించుకున్న సినిమా.. 95వ ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలని భారతీయ సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌ షార్ట్ లిస్ట్ అయింది. అయితే కీరవాణికి ఆస్కార్ అవార్డు వచ్చేందుకు అడుగు దూరంలోనే ఉందనిపిస్తోంది. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలిం అవార్డ్స్‌ గెలుచుకుంది.

Read Also: Kerala IMax: ఫలించిన సినిమా ప్రేమికుల నిరీక్షణ.. కేరళలో మొదటి ఐమాక్స్ ప్రారంభం

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఇప్పటి వరకు నాటు నాటు సాంగ్‌ అయితే షార్ట్ లిస్ట్ అయింది. ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా ఈ కేటగిరీకి 81 పాటలు అర్హత సాధించగా.. పదిహేను బెస్ట్ పాటలతో నాటు నాటు సాంగ్ పోటీ పడనుంది. ఈ పదిహేను పాటల్లోంచి ఒక పాటకు మాత్రమే ఆస్కార్ అవార్డ్ వస్తుంది. ఈ క్రమంలోనే నాటు నాటు సాంగ్‌కు కచ్చితంగా ఆస్కార్ అవార్డ్ వస్తుందని అంతా భావిస్తున్నారు. ఇండియాకు ఇది ప్రౌడ్ మూమెంట్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నామినీలను నిర్ణయించడానికి మ్యూజిక్ బ్రాంచ్ సభ్యులు ఓటు వేస్తారు. మొత్తం 23 పోటీ విభాగాల్లో నామినేషన్లను 2023 జనవరి 24న ప్రకటిస్తారు. ఇక 95వ అకాడమీ అవార్డుల ఫైనల్ ఈవెంట్ 2023 మార్చి 12న నిర్వహించబడుతుంది. కాగా.. అకాడమీ 23 కేటగిరీల్లో 10 షార్ట్‌లిస్ట్‌లను ప్రకటించగా.. అందులో ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఒకటి. తర్వాతి దశలో ఇంకా మిగిలిన విభాగాల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’కు అవకాశం ఉంటుంది.

ఇదిలా ఉంటే.. ఆస్కార్‌కు భారతదేశం నుంచి అఫిషియల్ ఎంట్రీగా అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో ఛెల్లో షో(ది లాస్ట్ ఫిల్మ్ షో) కూడా షార్ట్‌లిస్ట్ చేయబడింది. మొత్తానికి ఎస్ ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి, ఆర్ఆర్ఆర్ బృందం వారి మెమొరబుల్ జర్నీలో కీలకమైన మొదటి అడుగు వేసినందుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Show comments