NTV Telugu Site icon

MLC Kaushik Reddy: నేడు జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరుకానున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

New Project

New Project

MLC Kaushik Reddy: గవర్నర్ తమిళిసై పై కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. నేడు ఉదయం 11.30 గంటలకు కమిషన్ ముందు హాజరుకావాలని కౌశిక్ రెడ్డిని సూచించింది. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై పై కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను మహిళా కమిషన్‌ సుమోటోగా తీసుకుంది. తమిళిసై పై కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నేడు ఢిల్లీలో కమిషన్ ముందు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు.

Read Also: Buddha Venkanna: దమ్ముంటే రండి… తేల్చుకుందాం

అసలేం జరిగిందంటే.. అసెంబ్లీలో తీర్మానం చేసిన ఫైళ్లను గవర్నర్ తన దగ్గర పెట్టుకున్నారని, ఒక్క ఫైల్‌ను కూడా కదలనివ్వడం లేదని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై ఈటల రాజేందర్‌ సమాధానం చెప్పాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ వివేక్ దగ్గర వంద కోట్ల రూపాయల వరకు తీసుకుని హుజురాబాద్‌లో ఖర్చు పెట్టామని ఈటల చెప్పారని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ఆ డబ్బులు ఏమయ్యాయని ఐటీ, ఈసీకి ఫిర్యాదు చేస్తామని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. తమిళసై పై కౌశిక్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కౌశిక్‌రెడ్ది దిషిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేసిన విషయం తెలిసిందే. తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్‌రెడ్డిపై బీజేపీ నేతలు జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్‌రెడ్డిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Read Also: Revanth Reddy : ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లు నీవురుగప్పిన నిప్పులా ఉంది