NTV Telugu Site icon

Awards: క్రీడారత్నాలకు జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం.. తెలుగు తేజం నిఖత్ జరీన్‌కు అర్జున అవార్డు

Sports Awards

Sports Awards

Awards: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రతి ఏటా జరిగే జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిష్టాత్మక అవార్డులను బహుకరించారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును టేబుల్ టెన్నిస్ లెజెండ్ అచంట శరత్ కమల్ అందుకోగా.. అర్జున అవార్డును 25 మంది క్రీడాకారులు స్వీకరించారు. భారత స్టార్ బాక్సర్, తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ అర్జున అవార్డు అందుకుంది. ఆమెతో పాటు తెలంగాణ నుంచి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ కూడా ఈ పురస్కారాన్ని అందుకుంది. భారత యువ గ్రాండ్ మాస్టర్‌ ప్రజ్ఞానంద, బ్యాడ్మింటన్‌ ప్లేయర్స్ లక్ష్యసేన్‌, హెచ్ఎస్ ప్రణయ్‌ కూడా అర్డున అవార్డును అందుకున్నారు. భారత క్రీడా మంత్రిత్వ శాఖ నవంబర్ 14న ఈ ఏడాదికి సంబంధించిన క్రీడా పురస్కారాల వివరాలను ప్రకటించింది. రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్‌కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నాడు. ఈ ఏడాది క్రికెట్ నుంచి దినేష్ లాడ్ ఒక్కరే క్రీడా పురస్కారం అందుకున్నారు.

China: చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూత..ఇతని హయాంలోనే ఆర్థిక శక్తిగా చైనా

విజేతల జాబితా ఇదే..

మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు: ఆచంట శరత్ కమల్

అర్జున అవార్డులు: ఆర్ ప్రజ్ఞానంద (చెస్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), సీమా పూనియా (అథ్లెటిక్స్), ఆల్డస్ పాల్ (అథ్లెటిక్స్), అవినాష్ సాబుల్ (అథ్లెటిక్స్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), హెచ్ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్), అమిత్ (బాక్సింగ్), సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లోన్‌బాల్), సాగర్ ఓవల్కర్ (మల్కాంబ్), ఎలవెనిల్ వలరివన్ (షూటింగ్), భక్తి కులకర్ణి (చెస్) , వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్), అన్షు (రెజ్లింగ్), సరిత (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మాన్సీ జోషి (పారా బ్యాడ్మింటన్), తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనికా జె (చెవిటి బ్యాడ్మింటన్), దీప్ గ్రేస్ ఇక్కా (హాకీ), ​​ఓంప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్), వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్), అన్షు (రెజ్లింగ్), సరిత (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మాన్సీ జోషి (పారా బ్యాడ్మింటన్), తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనికా జె (చెవిటి బ్యాడ్మింటన్)

ద్రోణాచార్య అవార్డు : సుమా షిరూర్ (పారా-షూటింగ్), సుజిత్ మాన్ (రెజ్లింగ్), జీవన్‌జోత్ సింగ్ తేజ (ఆర్చరీ), మహ్మద్ అలీ కమర్ (బాక్సింగ్),

జీవితకాల పురస్కారం: రాజ్ సింగ్ (రెజ్లింగ్), దినేష్ లాడ్ (క్రికెట్), బిమల్ ఘోష్ (ఫుట్‌బాల్),

ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: బీసీ సురేష్ (కబడ్డీ), నీర్ బహదూర్ గురుంగ్ (పారా అథ్లెటిక్స్), అశ్విని అక్కుంజీ (అథ్లెటిక్స్), ధరమ్‌వీర్ సింగ్ (హాకీ), ​​

జాతీయ క్రీడల ప్రమోషన్ అవార్డు: ట్రాన్స్ స్టేడియా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లడఖ్ స్కీ అండ్ స్నోబోర్డ్ అసోసియేషన్.

 

Show comments