Site icon NTV Telugu

Andhrapradesh: ఏపీకి జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు.. అధికారులను అభినందించిన సీఎం

Andhrapradesh

Andhrapradesh

Andhrapradesh: ఇంధన పొదుపు, సంరక్షణలో ఏపీ మరోసారి తన సత్తాను నిరూపించుకుంది. ఇంధన భద్రత దిశగా రాష్ట్ర సర్కారు కృషిని గుర్తించిన కేంద్రం.. ప్రతిష్ఠాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డును అందజేసింది. ఇంధన వినియోగం ఆధారంగా రాష్ట్రాలను నాలుగు గ్రూపులుగా విభజించింది. రెండో గ్రూపులో ఉన్న ఏపీ అత్యుత్తమ పనితీరు కనబరిచి ప్రథమ బహుమతిని సొంతం చేసుకుంది. జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలవడం గమనార్హం.

Karumuri Nageswara Rao: బీసీలకు ఏం చేశారో టీడీపీ శ్వేతపత్రం విడుదల చేయాలి..

ఏపీ జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు గెలుచుకోవడంపై మంత్రి, అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు. ఇంధన భద్రత దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించి ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డుకు ఏపీని కేంద్రం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న అవార్డును సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూపించారు. ఆయనతో పాటు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఆంధ్రప్రదేశ్‌ ఇంధన పరిరక్షణ మిషన్‌ సీఈవో ఏ.చంద్రశేఖర్‌ రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వితేజ్‌ ఉన్నారు.

Exit mobile version