NTV Telugu Site icon

National Conference: బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి “వ్యూహాత్మక పొత్తు” కు కూడా సిద్దమే

Bjp

Bjp

National Conference: బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి ఎన్నికల ఫలితాల తర్వాత “వ్యూహాత్మక పొత్తు” కు “నేషనల్ కాన్ఫరెన్స్” (ఎన్.సి) సిద్దమే అని జమ్మూ & కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. రాష్ట్రాభివృద్ధే, అభ్యున్నతే అందరి లక్ష్యం అయునప్పుడు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అభ్యంతరం ఏముంద.? ఎందుకు కాకూడదు? అంటూ.. ఎన్నికల్లో ప్రత్యర్థులం కావచ్చు. నాకెలంటి అభ్యంతరం లేదు.. బహుశా కాంగ్రెస్ పార్టీకి కూడా ఏలాంటి అభ్యంతరాలు ఉండవనే అనుకుంటున్నానని ఆయన అన్నారు. నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదని, నేను చేయాల్సింది చేశాను. నా ముందున్న సమస్యల్లా “బలమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలన్నదే” అని ఆయన అన్నారు.

NCERT Books In Amazon: అమెజాన్‌తో విద్యా మంత్రిత్వ శాఖ ఒప్పందం.. అమెజాన్‌లో అందుబాటులోకి NCERT పుస్తకాలు

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఇండిపెండెంట్లను సంప్రదించడంలో నాకెలాంటి అభ్యంతరాలు లేవని., అంతమాత్రాన, వాళ్ళను దేబిరించి అడుక్కునేది లేదని తేల్చేసారు. రాష్ట్రాన్ని బలోపేతం చేయాలనే భావన, ఆలోచన వారికుంటే, స్వాగతించేందుకు సిద్దమని.. “ఇండియా” కూటమి భాగస్వామ్య పక్షాలుగా “నేషనల్ కాన్ఫరెన్స్”(ఎన్.సి), కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో, పొత్తుపెట్టుకొని కలిసి పోటీ చేశాయని తెలిపాడు.

Deputy CMO: ఆహారంలో టీబీ బ్యాక్టీరియా కలిపి డిప్యూటీ సీఎంఓను చంపేందుకు యత్నం.. ఆడియో లీక్

అయితే, సీట్ల సర్దుబాటు కుదరక ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసింది మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ నేతృత్వంలోని “పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ” (పిడిపి). ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు వేచి చూద్దాం, ప్రజల తీర్పు ను బట్టి ఆలోచిద్దాం, అప్పటివరకు ఎలాంటి ఊహాగానాల చేయద్దని అన్నారు “నేషనల్ కాన్ఫరెన్స్”(ఎన్.సి) నాయకుడు ఒమర్ అబ్దుల్లా”. అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన మహబూబా ముఫ్తీ కుమార్తె ఇతీజా. సెక్యులర్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని సమర్ధించే అంశంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసారు మాజీ ముఖ్యమంత్రి, “పిడిపి” అధినేత మహబూబా ముఫ్తి. 90 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన “మాజిక్ ఫిగర్” 46. ఈ నేపథ్యంలో 12 స్థానాల్లో పిడిపి గెలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల అంచనా.