Girl Stunt on Running Train: పిచ్చి పిచ్చి పనులు చేస్తూ కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సరదా కోసం చేసే పనులు ఉసురు తీస్తున్నాయి. అలా ప్రాణాలు కోల్పొయిన వారికి సంబంధించి ఎన్నో వార్తలు, కథనాలు మనం రోజూ చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అయినా చాలా మందిలో మార్పు రావడం లేదు. ప్రాణాలు పోతాయి అని తెలిసినా పిచ్చి పనులు ఆపడం లేదు. వ్యూస్ కోసం, లైక్ ల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నాయి. రోజు ఇంటర్నెట్ లో ఎన్నో వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే కొన్ని భయపెట్టేలా ఉంటాయి. కొంతమంది సాహసాలు చేస్తూ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇలాగే చేయబోయి రెప్పపాటులో తప్పించుకుంది ఓ యువతి.
Also Read: Tamilnadu Accident: ఆగి ఉన్న లారీని ఢీ కొన్న వ్యాన్.. ఆరుగురు మృతి.. వైరల్ వీడియో
ఈ వీడియో ఎక్కడ తీశారో తెలియదు కానీ ఇందులో ఓ యువతి బాగా స్పీడ్ గా వెళ్తున్న ట్రైన్ లో బయటకు వచ్చే డోర్ పట్టుకొని గాల్లో వేలాడింది. అచ్చం రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే చేసినట్లుగానే. అయితే ఇక్కడే ఆమెకు ఓ షాకింగ్ ఘటన ఎదురయ్యింది. యువతి ట్రైన్ లో నుంచి చేతులు గాల్లో పెట్టి మంచి ఫోజ్ ఇస్తుంది. దానిని దూరం నుంచి ఎవరో షూట్ చేస్తున్నారు. ఇంతలోనే ఓ పోల్ వచ్చింది. కొద్దిలో ఆ అమ్మాయి తప్పించుకుంది. ప్రమాదం నుంచి బయటపడిన తరువాత ఆ అమ్మాయి రియాక్షన్ చూడాలి. బతికిపోయాను రా దేవుడా అనేలా ఉంది. కొద్దిలో మిస్ అయ్యింది కానీ ఆ పోల్ కు కనుక తగిలి ఉంటే ఆ అమ్మాయి ప్రాణాలే పోయుండేవి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఇలాంటి ప్రాణాలు పోయే సాహసాలు అవసరమా అంటూ నెటిజన్లు హితవు పలుకుతున్నారు. భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టే కొద్దిగలో బతికిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది నెటిజన్స్ ఇలాంటి జీవితాలు మళ్లీ జీవితంలో చేయదంటున్నారు.
— CCTV IDIOTS (@cctvidiots) September 2, 2023
