Site icon NTV Telugu

Nari Nari Naduma Murari Trailer: ఈ గౌతమ్ ఎవరమ్మా.. ‘నారి నారి నడుమ మురారి’ ట్రైలర్‌ చూశారా!

Nari Nari Naduma Murari Tra

Nari Nari Naduma Murari Tra

Nari Nari Naduma Murari Trailer: శర్వానంద్ కొత్త చిత్రం ‘నారి నారి నడుమ మురారి’ ట్రైలర్‌ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ ట్రైలర్‌‌ను పరిశీలిస్తే సినిమా కథ శర్వానంద్ పాత్ర చుట్టూ తిరుగుతుందని అర్థం అవుతుంది. తన ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ తండ్రిని ఒప్పించి, పెళ్లికి అంతా సిద్ధం చేసుకున్న సమయంలో.. తన జీవితంలోకి ఎక్స్ లవర్ అకస్మాత్తుగా ప్రవేశిస్తుంది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య చిక్కుకున్న శర్వా పడే పాట్లు, ఆ క్రమంలో వచ్చే హాస్య సన్నివేశాలు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి.

READ ALSO: India vs New Zealand 1st ODI: భారత్ టార్గెట్ 301 పరుగులు..

సినిమాలో శర్వా ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ తండ్రి.. ఈ గౌతమ్ ఎవరమ్మా అంటూ పలికిన డైలాగ్స్, శర్వా తనను తాను పరిచయం చేసుకునే సన్నివేషాలు హైలైట్‌గా ఉంటాయి. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. జ్ఞానశేఖర్ వీఎస్, యువరాజ్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్‌ని ఇచ్చింది. విశాల్ చంద్ర శేఖర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లోని హ్యూమర్‌ని మరింత ఎలివేట్ చేసింది. ‘నారి నారి నడుమ మురారి’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన సాయంత్రం 5:49 గంటలకు ఫస్ట్ షోతో థియేటర్లలో సందడి చేయనుంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే అన్ని అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది.

READ ALSO: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అరుదైన బిరుదు ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’

Exit mobile version