Nari Nari Naduma Murari Trailer: ఈ గౌతమ్ ఎవరమ్మా.. ‘నారి నారి నడుమ మురారి’ ట్రైలర్ చూశారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nari Nari Naduma Murari Trailer: శర్వానంద్ కొత్త చిత్రం ‘నారి నారి నడుమ మురారి’ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ ట్రైలర్‌ను పరిశీలిస్తే సినిమా కథ శర్వానంద్ పాత్ర చుట్టూ తిరుగుతుందని అర్థం అవుతుంది. తన ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ తండ్రిని ఒప్పించి, పెళ్లికి అంతా సిద్ధం చేసుకున్న సమయంలో.. తన జీవితంలోకి ఎక్స్ లవర్ అకస్మాత్తుగా ప్రవేశిస్తుంది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య చిక్కుకున్న శర్వా పడే పాట్లు, ఆ క్రమంలో వచ్చే హాస్య సన్నివేశాలు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి.
READ ALSO: India vs New Zealand 1st ODI: భారత్ టార్గెట్ 301 పరుగులు..
Also Read
- Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. 'మునగాకు పొడి'.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
- KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
- CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
- Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
సినిమాలో శర్వా ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ తండ్రి.. ఈ గౌతమ్ ఎవరమ్మా అంటూ పలికిన డైలాగ్స్, శర్వా తనను తాను పరిచయం చేసుకునే సన్నివేషాలు హైలైట్‌గా ఉంటాయి. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. జ్ఞానశేఖర్ వీఎస్, యువరాజ్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్‌ని ఇచ్చింది. విశాల్ చంద్ర శేఖర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లోని హ్యూమర్‌ని మరింత ఎలివేట్ చేసింది. ‘నారి నారి నడుమ మురారి’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన సాయంత్రం 5:49 గంటలకు ఫస్ట్ షోతో థియేటర్లలో సందడి చేయనుంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే అన్ని అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది.
READ ALSO: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అరుదైన బిరుదు ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’
తాజావార్తలు
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
-
CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
-
Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?