Actor Naresh : త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే ..అయితే నటి పవిత్ర మరణాన్నితట్టుకోలేకపోయిన సీరియల్ నటుడు చంద్రకాంత్ పవిత్ర చనిపోయిన కొద్దీరోజులకే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు.అయితే ఈ విషయంపై టాలీవుడ్ సీనియర్ నటుడు అయిన నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మనకు సర్వస్వం అనుకునే వారు సడన్ గా మన నుంచి దూరమైనప్పుడు మనకు ఎంతో భాధ కలుగుతుంది ..ఆ సమయంలో మనల్ని ఓదార్చే వారు పక్కన ఉండాలి .
Read Also :Pushpa 2 : పుష్ప 2 నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో వచ్చేసింది…
ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు వుండేవి.కుటుంబంలో ఒకరికి ఏదైనా జరిగితే మిగిలిన వారు అంతా కూడా తనకి తోడుగా నిలిచేవారు.అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.ఎవరి లోకం వారిది అన్నట్టు వుంటున్నారు. మా అమ్మ విజయనిర్మల గారు మరణించినప్పుడు.. నేను, కృష్ణ గారు ఎంతగానో బాధ పడ్డాము. ఆ సమయంలో ఆయన నన్ను ఓదార్చే వారు,నేను ఆయన్ని ఓదార్చే వాడిని ఇలా ఆ బాధ నుంచి బయటకు వచ్చాము.ఇలా కుటుంబసభ్యులు బాధ పడుతున్న వ్యక్తికి అండగా నిలవాలి అని నరేష్ తెలిపారు.అయితే ఇప్పటి బిజీ లైఫ్ లో పక్కవారి గురించి ఆలోచించడమే మానేసాము..ఆ పరిస్థితి మారాలి..నటి పవిత్ర మరణం చూసి చందు తట్టుకోలేకపోయాడు.ఈ లోకంలో తనకు ఇంక ఎవరు లేరని ఒంటరిగా కూర్చొని బాధపడ్డాడు.ఆ బాధే అతనిని ఆత్మహత్య చేసుకునేలా చేసింది అని నరేష్ తెలిపారు.