NTV Telugu Site icon

Naresh- Pavitra Lokesh: అబ్బో లైవ్ లోనే.. ముద్దులతో రెచ్చిపోయిన పవిత్ర-నరేష్

Naresh Pavitra

Naresh Pavitra

సీనియర్ నటుడు నరేష్ గురించి ఇప్పుడు మనం స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.. ఇప్పుడు ఆయన పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లో ఉంది. కొందరు పవిత్ర లోకేశ్-నరేష్ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అంటుంటే మరికొందరు కాదు కాదు డేటింగ్ లోనే ఉన్నారు అంటూ చెబుతున్నారు. అయితే ఎవరేన్ని అనుకున్నా.. ఈ ముదురు జంట మాత్రం అంతా మా ఇష్టం అంటూ రెచ్చిపోతున్నారు. సినిమా పేరు చెప్పుకొని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ పెళ్లితో తమ లవ్ స్టోరీనే వెండితెరపై నరేష్-పవిత్ర ఆవిష్కరించబోతున్నారు. మే 26న ఈ సినిమా రిలీజ్ కాబోతుండగా.. ప్రమోషన్స్ లో వీరు ఇరువురు జోరును పెంచారు.. అందులో భాగంగా ఓ టీవీ ఛానెల్ లైవ్ షోలోనే ముద్దులతో రెచ్చిపోయారు..

Also Read : Raviteja: మాస్ మహారాజ కోసం అయిదు మంది సూపర్ స్టార్స్…

ఈ క్రమంలోనే బుల్లితెరలోని పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇందులో భాగంగా ఓ ప్రొగ్రామ్‌లో హోస్ట్ నరేశ్-పవిత్ర రిలేషన్‌షిప్ స్టేటస్ అడగ్గా స్పందించిన నరేష్.. ఆకాశం ఊడిపడినా.. భూమి బద్ధలైనా.. మేము కలిసే ఉంటాం అంటూ పవిత్రకు నుదుటి మీద ముద్దుపెట్టాడు. దీంతో పవిత్ర కూడా నరేష్‌ను కిస్ చేసింది. కాగా ఈ వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. నరేష్ లేట్ వయసులో ఘాటు ప్రేమను అనుభవిస్తున్న అదృష్టవంతుడంటూ రకరకాల కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. అయితే, తాజాగా ఈ జంట ఓంకార్‌ హోస్ట్ గా చేస్తున్న సిక్త్స్ సెన్స్ షోకి వెళ్లారు. ఇందులో ఆసక్తికర విషయాలను ఇద్దరు పంచుకున్నారు. పవిత్రని ముద్దుగా ఏమని పిలుచుకుంటారో నరేష్ చెప్పారు.

Also Read : Jammu Kashmir: కాశ్మీర్ వేర్పాటువాది హత్య.. 33 ఏళ్ల తర్వాత టెర్రరిస్టుల అరెస్ట్..

తాను ప్రవిత్రను ముద్దుగా అమ్ములు అని పిలుచుకుంటాను అని నరేశ్ చెప్పుకొచ్చాడు. ఇంకా ప్రేమ ఎక్కువైతే అమ్ము అని, ఇంకా ప్రేమ ఎక్కువైతే ఏమని పిలుస్తానో తెలుసా.. అంటూ సస్పెన్స్ పెట్టి వద్దులే అని వదిలేశాడు నరేష్‌. ప్రస్తుతం మీ రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌ ఏంటని ఓంకార్‌ ప్రశ్నించడంతో.. ఆకాశం మీద పడినా, భూమి బద్దలైనా, మేం కలిసి ఉంటామని నరేష్‌ క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా నరేష్‌ ఉబ్బితబ్బయ్యాడు. అనంతరం ఇద్దరు కలిసి డాన్స్ చేశారు. స్టేజ్‌పైనే నానా రచ్చ చేశారు. అంతేకాదు ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకున్నారు. ఓ రకంగా ముద్దుల వర్షం కురిపించారు అనుకోండి. ఇది ప్రస్తుతం నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక నెటిజన్స్ కూడా వదలకుండా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బాబోయ్ ఈ సభ్య సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.