Site icon NTV Telugu

Pappu Yadav: ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నరేంద్ర మోడీ ప్రధాని కాలేడు..

Pappu Yadav

Pappu Yadav

బీహార్ రాష్ట్రంలోని పూర్నియా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా గెలుపొందిన పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా నరేంద్ర మోడీ ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు. గులాబాగ్‌లోని ఫెయిర్‌ గ్రౌండ్‌లో జరిగిన స్వాగత కార్యక్రమంలో పప్పు యాదవ్‌ ఈ కామెంట్స్ చేశారు. త్వరలోనే ఇండియా అలయన్స్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ గాంధేయ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారని చెప్పుకొచ్చారు.. అంబేద్కరైట్, ఆయన ఎప్పుడూ సెక్యులర్‌గా ఉన్నారు.. నితీష్ కుమార్ నేడు దేశం కోసం నిలబడితే దేశం గర్విస్తుంది.. భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని చంద్రబాబు నుంచి నాకు కూడా ఆశ ఉంది అని పప్పు యాదవ్ పేర్కొన్నారు.

Read Also: JC Prabhakar Reddy :మున్సిపల్ చైర్మన్ పదవికి మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!

న్యాయం కోసం వచ్చాం.. ప్రతి కుటుంబానికి న్యాయం చేయడమే నా పని అని పప్పు యాదవ్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేని, సాధారణ ప్రజలను తప్పుగా రిక్రూట్ చేసే ఇలాంటి నర్సింగ్‌హోమ్‌లకు నేను వ్యతిరేకం అని వార్నింగ్ ఇచ్చారు. బౌన్సర్‌ని పెట్టుకోవద్దని చెప్పాను, పేషెంట్ అటెండర్‌లను కొట్టారు, ఇలా చేయకండి అంటూ డాక్టర్ల మాఫియాపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాగా, పప్పు యాదవ్ పూర్ణియా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 23 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. ఆర్జేడీ నేత బీమా భారతి, జేడీయూ అభ్యర్థి సంతోష్‌ కుమార్‌లను ఓడించారు. మహా కూటమి సీట్ల పంపకంలో ఈ సీటు ఆర్జేడీకి దక్కింది.

Exit mobile version