PM Modi: ప్రపంచానికే పెద్దన్న మోడీ.. గ్లోబల్ లీడర్ల జాబితాలో నంబర్ వన్.. టాప్ 10లోనూ కనిపించని ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Morning Consult: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచారు. మరోసారి విశ్వ గురువుగా పేరు సాధించారు. అమెరికన్ డేటా అనలిటిక్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం, ప్రధానమంత్రి మోడీ 68 శాతం అద్భుతమైన ఆమోద రేటింగ్ (Approval Rating)ను పొందారు. ఈ అఖండ మద్దతుతో ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నాయకులను అధిగమించి ప్రపంచ నాయకుల జాబితాలో అగ్రస్థానంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. వరుసగా మూడోసారి అధికారంలో ఉన్నప్పటికీ.. ఈ ఆమోద రేటింగ్ (Approval Rating) వెనక్కి తగ్గలేదు. ఇది బలమైన నాయకత్వం, ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న విస్తృత ఆమోదాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. సర్వే డేటా ప్రకారం.. కేవలం 26 శాతం మంది మాత్రమే మోడీకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, 6 శాతం మందికి ఎటువంటి అభిప్రాయాన్ని తెలుపలేదు.
READ MORE: AP Assembly Special Session: రేపే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
అంతేకాదు.. మార్చి 2 నుంచి 8 మధ్య మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన ఈ సర్వే, ఇతర ప్రపంచ నాయకుల స్థానాన్ని సైతం వెల్లడించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన గై పార్మెలిన్, దక్షిణ కొరియాకు చెందిన లీ జే-మ్యుంగ్ చెరో 62 శాతం ఆమోద రేటింగ్‌లతో రెండవ స్థానంలో నిలిచారు. వారి తర్వాత చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఆండ్రెజ్ బాబిస్ 57 శాతం మద్దతుతో, అర్జెంటీనాకు చెందిన జేవియర్ మెల్లి 56 శాతం మద్దతుతో నిలిచారు. అదేవిధంగా జపాన్‌కు చెందిన సనాయ్ టకైచి, కెనడాకు చెందిన మార్క్ కార్నీ చెరో 56 శాతం ఆమోద రేటింగ్‌లను పొందారు. మరోవైపు, పాశ్చాత్య దేశాలలోని అనేక ప్రముఖ నాయకులు చాలా బలహీనమైన స్థితిలో ఉన్నారని ఈ సర్వే చూపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ జాబితాలోని టాప్ 10లో కూడా చోటు సంపాదించలేకపోయారు. ట్రంప్‌కు కేవలం 39 శాతం ఆమోదం లభించగా, 55 శాతం మంది ఆయనను వ్యతిరేకించారు. అదే సమయంలో బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్‌కు కేవలం 24 శాతం మద్దతు లభించగా, జర్మనీకి చెందిన ఫ్రెడ్రిక్ మెర్జ్‌కు 20 శాతం మద్దతు లభించింది. ఈ జాబితాలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచారు. ఆయనకు కేవలం 17 శాతం ఆమోదం, 75 శాతం వ్యతిరేకత నమోదైంది. పూర్తి లిస్ట్ ఈ కింద ఇవ్వబడింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!