శుక్రవారం నాడు జరిగిన ఎన్డిఏ కూటమి మీటింగ్ లో భాగంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్ష భారత కూటమిపై విరుచుకుపడ్డాడు. ఫలితాలు ప్రకటించినప్పుడు నుండి ఇండి కూటమి వాళ్ళు ఓటింగ్ మిషన్లు బాగానే బ్రతికే ఉన్నాయా.. చనిపోయాయా.. అంటూ రిగ్గింగ్ ఆరోపణలను ప్రసావిస్తుండగా ఆయన ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు ఇవియం పై నిందలు వేసి భారతీయ ఎన్నికల సంఘాన్ని నిర్వీర్యం చేసేందుకు వారు ప్రయత్నించారని మోడీ ఆరోపించారు.
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీని మోడీ టార్గెట్ చేస్తూ.. 10 ఏళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ వంద సీట్లు కూడా గెలవలేకపోయిందని 2014, 2019, 2024 ఎన్నికలను కలిపితే ఈ ఎన్నికల్లో బిజెపికి వచ్చిన అన్ని సీట్లు కూడా కాంగ్రెస్ కు రాలేదని ఎద్దేవా చేశారు. దేశంలోని ప్రజలు కేవలం ఎన్డీఏను మాత్రమే విశ్వసిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి నమ్మకం ఉన్నప్పుడు దేశం పై అంచనాలు కూడా పెరగడం సహజమేనని ఇది మంచి పరిణామంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Hyderabad Rains: హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షాలు..
గత పది సంవత్సరాల కేవలం ట్రైలర్ మాత్రమేనని నేను ముందే చెప్పాను. దేశ ఆకాంక్షలను నెరవేర్చడంలో కొంచెం కూడా ఆలస్యం చేయకుండా తాము మరింత వేగంతో, మరింతగా ఆత్మవిశ్వాసంతో, మరింత వివరంగా పనిచేస్తామని ఆయన నొక్కి చెప్పారు. ఇక నేడు బిజెపి నేతగా, ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా, లోక్సభ నాయకుడిగా నరేంద్ర మోడీ ఈరోజు అధికారికంగా ఎన్నికయ్యారు. ఎన్డీఏ మిత్ర ప్రతిపక్షాల నేతలు నరేంద్ర మోడీకి పూలమాల వేసి అభినందించారు. జూన్ 9 న మోడీ 3 వ సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
