Site icon NTV Telugu

AP Liquor Scam Case: నేను ఆ విషయం సిట్‌కు చెప్పలేదు.. ల్యాప్‌టాప్‌ అంటే తెలియదు.. వాట్సాప్‌ వాడటం కూడా రాదు..!

Narayana Swamy

Narayana Swamy

AP Liquor Scam Case: ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్‌ స్కాం కేసులో శుక్రవారం రోజు వైసీపీ సీనియర్‌ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ప్రశ్నించారు సిట్‌ అధికారులు.. దాదాపు 6 గంటల పాటు నారాయణస్వామిని విచారించిన సిట్‌ అధికారులు కీలక విషయాలు రాబట్టారని.. ఆయన కీలక సమాచారం ఇచ్చారని, ల్యాప్‌టాప్‌ కూడా సీజ్‌ చేశారని వార్తలు వచ్చాయి.. అయితే, సిట్‌ విచారణపై మరోసారి మీడియాతో మాట్లాడిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఆసక్తికర విషయాలు వెల్లడించారు.. సిట్ వారు సహకరించారు.. వారు ఆడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను… కేసుతో నాకేం సంబంధం లేదు.. అంతా పైవాళ్లే చేశారని నేను ఎక్కడ సిట్ అధికారులకు చెప్పలేదని స్పష్టం చేశారు.. సిట్ అధికారులు ఇబ్బంది పడే ప్రశ్నలు అడిగాన‌.. నేను సమాధానం చెప్పాను… నన్ను అరెస్టు చేశారంటూ కోందరూ అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు.

Read Also: Parliament: ప్రధాని మోడీ, వీవీఐపీల భద్రతకు ముప్పుగా మారిన చెట్టు.. అసలేంటి ఈ కథ..?

నేనెప్పుడూ నీతిగా, నిజాయితీ బతికాను… ఎప్పుడూ తప్పు చేయలేదు.. అవినీతి చేయలేదన్నారు నారాయణస్వామి.. ఇక, నాకు ల్యాప్‌టాప్ అంటే ఏంటో.. దానిని ఎలా వాడాలో కూడా తెలియదు‌‌‌‌‌‌‌.. నాకు వాట్సాప్‌ వాడటం కూడా రాదన్నారు.. ల్యాప్ టాప్ సిట్‌ అధికారులు తీసుకుని పోలేదన్నారు.. ప్రభుత్వం తరపున మద్యం అమ్మకాలు చేస్తే అవినీతికి అవకాశం ఉండదు అని తెలిపారు.. ప్రైవేటు గా అమ్మకాలు సాగిస్తేనే అవినీతి జరుగుతుందన్నారు.. కూటమీ ప్రభుత్వంలో రాష్ట్రంలో పాల ప్యాకెట్ల కంటే మద్యం 24 గంటలకు దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.. నేను ఎక్కడ తప్పుడు సంతకాలు పెట్టలేదు… నేను ఏంటో చంద్రబాబుకు తెలుసు…. నేను మంచోడినని ఆయనే చెప్పారని గుర్తుచేసుకున్నారు.. మరోవైపు, జగన్ ఎప్పుడూ పిలిచి చెప్పిన పనులు చేయాలని నాకు చెప్పలేదు‌… ఎప్పుడూ పిలిస్తే అప్పుడు విచారణకు వెళ్తాను అన్నారు.. ఎనిమిది కోట్లు దొరికిందని అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి..

Exit mobile version