Site icon NTV Telugu

YSRCP: తాడేపల్లికి నరసారావుపేట వైసీపీ వర్గ పోరు.. జగన్ ముద్దు.. గోపిరెడ్డి వద్దు..

Ycp

Ycp

YSRCP: ఎన్నికలకు సమయం పడుతున్న కొద్దీ.. ఏపీలో రాజకీయాలు హీట్‌ పెంచుతున్నాయి.. ఇక, అధికార వైసీపీలో మార్పులు, చేర్పులు నేతలను టెన్షన్‌ పెడుతుండగా.. కొన్ని నియోజకవర్గాల్లో జగన్‌ ముద్దు.. మా ఎమ్మెల్యే వద్దు అంటూ ఆందోళనకు దిగుతున్నాయి వైసీపీ శ్రేణులు.. ఇప్పుడు పల్నాడు జిల్లా నరసారావు పేట వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్గపోరు తాడేపల్లికి చేరింది.. నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు స్థానిక నేతలు.. ఈ సారి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం ఆందోళన నిర్వహించింది..

Read Also: Health Tips : నల్ల వెల్లుల్లిని ఇలా తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

నరసరావుపేటలోని స్థానిక వైసీపీ నేతలతో కలసి ర్యాలీగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకుంది.. ఈ ఆందోళనను బ్రహ్మారెడ్డి వర్గం నిర్వహించింది.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం ముందు అనుచరులతో నిరసనకు దిగారు.. గోపిరెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వొద్దని బ్యానర్లు ప్రదర్శిస్తూ, నినాదాలు చేశాయి వైసీపీ శ్రేణులు.. గోపిరెడ్డి వద్దు.. జగన్ ముద్దు అంటూ నినాదాలు చేశారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.. మొత్తంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది బ్రహ్మారెడ్డి వర్గం. మరి.. ఇప్పటికే తొలి లిస్ట్‌లో నలుగురు మంత్రులు సహా 11 మంది సిట్టింగ్‌లకు స్థానాలు మారిపోయాయి.. మరికొందరికి ఈ సారి టికెట్‌ దక్కదనే సంకేతాలు ఇచ్చేశారు.. ఇక, సెకండ్‌ లిస్ట్‌ రెడీ అయ్యిందని.. రేపో మాపో అది కూడా వెలువడుతుందనే చర్చ సాగుతోంది.. మరి నరసరావుపేట విషయంలో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచిచూడాలి.

Exit mobile version