NTV Telugu Site icon

BJP MP Srinivas Varma: నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ భావోద్వేగం

Srinivas Varma

Srinivas Varma

BJP MP Srinivas Varma: నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్‌ వర్మను కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన భావోద్వేగానికి గురై… సోము వీర్రాజు కాళ్లకు మొక్కి.. ఆలింగనం చేసుకున్నారు. ఇది ఏపీ బీజేపీ కార్యకర్తల విజయమంటూ శ్రీనివాస్ వర్మ ఆనంద భాష్పాలు రాల్చారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తా.. గైడ్ చేయండని శ్రీనివాస్ వర్మ సోము వీర్రాజును కోరినట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఉమాబాలపై 2.76 లక్షల ఓట్ల మెజార్టీతో శ్రీనివాస్ వర్మ ఘన విజయం సాధించారు. గతంలో కూడా శ్రీనివాస వర్మ ఇలానే భావోద్వేగానికి గురయ్యారు. నరసాపురం లోక్‌సభ టికెట్ దక్కినప్పుడు కూడా బీజేపీ నేత భూపతిరాజు శ్రీనివాస వర్మ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ ఆఫీసు వద్ద నేలపై కమలం గుర్తుపై పడుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. 30 ఏళ్ల కష్టానికి గుర్తింపు దక్కిందని చెప్పుకొచ్చారు. నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్నారు.

 

Show comments