Site icon NTV Telugu

Srinivas Varma: బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. నా దగ్గర డబ్బు లేదు.. కానీ..!

Srinivas Varma

Srinivas Varma

Srinivas Varma: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన క్షత్రీయుల ఆత్మీయ సమావేశంలో నరసాపురం లోకసభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కొంతమంది నన్ను పార్లమెంట్ అభ్యర్థి నుండి మారుస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. నా దగ్గర డబ్బు లేదని కావాలని ప్రచారం చేశారని మండిపడ్డారు.. అయితే, నా దగ్గర డబ్బు లేదు.. కానీ, నిబద్ధత ఉందన్నారు. రాత్రికి రాత్రి పార్టీని మార్చి, బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టిన పరిస్థితి లేదు.. నేను అలాంటి వాడిని కాదన్నారు. ఏదైతే డబ్బు నా దగ్గర లేదని.. వారి దగ్గర ఎక్కువ ఉందని చెప్పారో వారికి తెలియాలన్నారు. అయితే, ఇప్పుడు నా స్నేహితుల ద్వారా డబ్బు సమకూర్చుకోగలుగుతున్నాను అని వ్యాఖ్యానించారు శ్రీనివాస్‌ వర్మ.. మరోవైపు.. పాలకొల్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గుడాల గోపిపై విమర్శలు సందించారు.. ఇక్కడ వైసీపీ అభ్యర్థిపై పేకాట కేసు, గోవా మద్యం కేసు ఉన్నాయని విన్నాను అంటూ ఎద్దేవా చేశారు నరసాపురం లోకసభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ.

Read Also: Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇలా..

Exit mobile version