NTV Telugu Site icon

Rammurthy Naidu: నారావారిపల్లెకు రామ్మూర్తి నాయుడి పార్థివదేహం.. నివాళులర్పించిన నేతలు!

Rammurthy Naidu Body

Rammurthy Naidu Body

ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడి పార్థివ దేహాన్ని కుటుంబసభ్యులు స్వగ్రామం నారావారిపల్లెకు తీసుకువచ్చారు. మంత్రి నారా లోకేశ్‌, హీరో నారా రోహిత్ సహా కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు చేరుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మరియు స్థానికులు రామ్మూర్తి నాయుడు భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు.. మరికాసేపట్లో నారావారిపల్లెకు రానున్నారు.

Also Read: AUS vs IND: నేనే రోహిత్ స్థానంలో ఉంటే.. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు!

మధ్యాహ్నం 2 గంటలకు నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తల్లిదండ్రులు అమ్మణమ్మ, ఖర్జూర నాయుడు అంతిమ సంస్కారాలు జరిగిన చోటే రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు కార్డియాక్‌ అరెస్టుతో తుదిశ్వాస విడిచారని ఏఐజీ ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. రామ్మూర్తి నాయుడుకు భార్య ఇందిర, కుమారులు గిరీశ్‌, రోహిత్‌ ఉన్నారు. రోహిత్‌ సినీ హీరో కాగా.. గిరీశ్‌ గల్ఫ్‌లో వ్యాపారం చేస్తున్నారు.

Show comments