ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడి పార్థివ దేహాన్ని కుటుంబసభ్యులు స్వగ్రామం నారావారిపల్లెకు తీసుకువచ్చారు. మంత్రి నారా లోకేశ్, హీరో నారా రోహిత్ సహా కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు చేరుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు మరియు స్థానికులు రామ్మూర్తి నాయుడు భౌతికకాయం వద్ద నివాళులు అర్పించారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు.. మరికాసేపట్లో నారావారిపల్లెకు రానున్నారు. Also Read: AUS vs IND: నేనే రోహిత్…
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో తీసుకువెళ్లనున్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్ నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు ఆయన భౌతికకాయం చేరుకుంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి నారా లోకేష్ తన చిన్నాన్న భౌతికకాయాన్ని దగ్గరుండి నారావారిపల్లెకు తరలిస్తున్నారు. తల్లిదండ్రులు అమ్మనమ్మ ,ఖర్జూర నాయుడు సమాధుల పక్కనే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. సోదరుడు రామ్మూర్తి నాయుడి అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు…