Nara Lokesh: ప్రమాదంలో చంద్రబాబు జీవితం.. అంతమొందించే కుట్ర..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. గత నెల 9వ తేదీన చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది.. చంద్రబాబు రిమాండ్ 36వ రోజుకు చేరింది.. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. చంద్రబాబును డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తు్న్నారని.. చంద్రబాబు భద్రత, ఆరోగ్య విషయంలో నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నామని జైలు అధికారులు స్పష్టం చేస్తు్నారు.. అయితే, జైలు అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచుతూనే 73 ఏళ్ల చంద్రబాబుని అనారోగ్య కారణాలతో అంతమొందించే కుట్ర జరుగుతోందన్నారు.
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
భద్రతలేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయనకి ప్రాణహాని తలపెడుతున్నారంటూ ఆరోపించారు నారా లోకేష్.. ఎన్నడూ ఏ తప్పూ చేయని 73 ఏళ్ల చంద్రబాబు పట్ల రాక్షసంగా వ్యవహరిస్తోంది ఈ ప్రభుత్వం అని మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉందన్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుని ముద్దాయి అని హెల్త్ బులెటిన్‌లో పదే పదే పేర్కొన్నారు.. ముద్దాయి అనేందుకు పెట్టిన శ్రద్ధ చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై పెట్టడంలేదన్నారు. చంద్రబాబుకి ఏ హాని జరిగినా, సైకో జగన్ సర్కార్, జైలు అధికారులదే బాధ్యత అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎందుకీ కక్ష? చంద్రబాబు జీవితం ప్రమాదంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!