Nara Lokesh: ప్రతీ కంపెనీ క్రెడిబులిటీ ఉన్నవే.. అయానా, గయానా కంపెనీలకు భూములు ఇవ్వలేదు!
- వైసీపీ, నారా లోకేష్ మధ్య మాటల యుద్ధం
- మండలిలో భూ కేటాయింపులపై వాడివేడి చర్చ
- 99 పైసలకు ఎకరం భూములిచ్చారనే అంశంపై వాగ్వాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైసీపీ, నారా లోకేష్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మండలిలో భూ కేటాయింపులపై వాడివేడి చర్చ నడుస్తోంది. కంపెనీలకు 99 పైసలకు ఎకరం భూములిచ్చారనే అంశంపై వాగ్వాదం నడిచింది. భూములిచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని గతంలోనే ఛాలెంజ్ చేశానని, వాళ్లు ఆధారాలు తీసుకురాలేకపోయారని మంత్రి లోకేష్ అన్నారు. క్రెడిబులిటీ ఉన్న కంపెనీలకే భూములు ఇస్తున్నాం అని లోకేష్ స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు ఎలా ఇస్తారు? అని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రహేజా రియల్ ఎస్టేట్ వ్యవస్థ కాదని మంత్రి అచ్చెన్నాయుడు బదులిచ్చారు.
శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ‘విశాఖను ఐటీ క్యాపిటల్‌గా చేయాలని ప్లాన్ ప్రకారం ముందుకు వెళుతున్నాం. ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాల కల్పన మా ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఐటీ రంగంలో ఐదు కంపెనీలలో ఐదు లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. దేశంలో నే 23.5శాతం పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి’ అని అన్నారు. శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘వైజాగ్‌లో 2006లోనే ఐటీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం. 2019 వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అదానీ డేటా సెంటర్ వచ్చింది. వైజాగ్‌లో చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఐదు వేల కోట్ల భూములు ఇస్తున్నారు. గీతంకి భూములు కేటాయింపుపై వాక్ ఔట్ చేస్తున్నాం’ అని అన్నారు. భూ కేటాయింపుల ప్రశ్నకు ప్రభుత్వ సమాధానానికి నిరసనగా ఆ ప్రశ్న నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు.
Also Read
- Hanamkonda: న్యాయం చేయమంటే నరకం చూపించాడు.. మహిళపై నాలుగేళ్లుగా ఎస్ఐ అత్యాచారం!
- Shubman Gill: "డోంట్ వర్రీ".. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!
- Modi-Trump Meeting: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు.. 16 నెలల తరువాత ఎదురుపడనున్న మోడీ, ట్రంప్..
శాసనమండలిలో 99 పైసలుకు పరిశ్రమలకు భూములు కేటాయింపుపై వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు ప్రభుత్వానికి ప్రశ్న వేయగా.. ఐదు కంపెనీలకు 99 పైసలకు భూములు కేటాయించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ‘గత 20 నెలల్లో ఏయే కంపెనీలకు 99 పైసలకే భూములు ఇచ్చారు. ఎవరికి ఎన్ని ఎకరాలు ఎంత ధరకు ఇచ్చారో చెప్పలేదు. గతేడాది ప్రారంభమైన కంపెనీలకు కూడా 99 పైసలుకే భూములిచ్చారు. విజయవాడలో రూ.156 కోట్ల పెట్టుబడులకు రూ.600 కోట్ల విలువైన భూములిచ్చారు. అమరావతికి టెండర్లు పిలిచారు. లూలు సంస్థకు ఎందుకు టెండర్లు పిలవలేదు. రూ.3 వేల కోట్ల విలులైన భూమిని రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలుకే లీజుకు ఇచ్చారు. రియల్ ఎస్టేట్ సంస్థలు స్థలాలు కొనుక్కోలేవా. 5 వేల కోట్ల విలువైన భూములను విశాఖలోని ఓ విద్యాసంస్థ తమ ఆధీనంలో ఉంచుకుంది. ఆ సంస్థ కేవలం తాము వెయ్యి కోట్ల విలువైన భూమినే ఆక్రమించామని చెప్తోంది. వెయ్యి కోట్ల విలువైతే భూములను ఆక్రమించొచ్చా?’ అని ఎమ్మెల్సీ మాధవరావు అడిగారు.
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ‘ఎంవోయూలన్నీ క్లారిటీగా ఉన్నాయి. 99 పైసలుకి 5 కంపెనీలకు మాత్రమే భూములు కేటాయించాం. కాగ్నిజెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఏఎన్ఎస్సార్ గ్లోబల్, రహేజా, మదర్స్ అండ్ ఇంటర్నేషనల్ కు 99 పైసలుకే భూములిచ్చాం. హైదరాబాద్‌లో రహేజా మైండ్ స్పేస్‌లో లక్ష మంది ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. రహేజా గ్లోబల్ బిల్డ్ కాపబులిటీ సెంటర్లు నిర్మిస్తుంది. మేం భూములిచ్చిన ప్రతీ కంపెనీ క్రెడిబులిటీ ఉన్నవే. రహేజా వాళ్ళు లక్ష ఎకరాల్లో నిర్మాణాలు చేసి సాఫ్ట్వేర్ కంపెనీలకు అద్దెకు ఇస్తారు. మేము పారదర్శకంగానే వాళ్లకు భూములు ఇస్తున్నాం. దానివల్ల వాళ్లు చేసిన నిర్మాణాల్లో పెద్ద ఎంఎన్సీ కంపెనీలకు ఇచ్చాం తప్ప అయానా.. గయానా కంపెనీలకు ఇవ్వలేదు’ అని బదులిచ్చారు.
తాజావార్తలు
-
Explainer: ప్రేమిస్తే జైలుకు..? శృంగారంలో పరస్పర అంగీకారం ఉన్నా కూడా రే*ప్ కేసు అవుతుందా?
-
Power Star : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. స్టార్ దర్శకుడితో సినిమా డౌటే
-
Bollywood Gossip : నేను ‘గే’ కాదు… హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
-
MRM Portal: MRM పోర్టల్ అంటే ఏమిటి? సైబర్ మోసంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఎలా పొందాలి?
-
Trisha : భారీ రెమ్యునరేషన్ అడిగిన త్రిష.. బిత్తరపోయిన నిర్మాత
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!