Nara Lokesh: ఏపీలో మరో ప్రాజెక్ట్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్.. అధిక సంఖ్యలో ఉద్యోగాలు..

  • మరో అద్భుత ప్రాజెక్ట్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్..
  • ఈ ప్రాజెక్ట్‌తో భారీగా ఉద్యోగ అవకాశాలు..
  • ఏపీని రక్షణ రంగంలో కూడా అగ్రస్థానంలో నిలుపుతామన్న మంత్రి..
Nara Lokesh In Ap

Nara Lokesh In Ap

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రపథాన నిలిపే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలతో పాటు రక్షణ , తయారీ రంగాల్లోనూ ఏపీని గ్లోబల్ హబ్‌గా మార్చాలన్న లక్ష్యంతో నెల్లూరు జిల్లాలో ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న అటానమస్ మారిటైం షిప్ యార్డుకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ భూమిపూజ చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైం షిప్ యార్డు కావడం విశేషం. ఈ ప్రాజెక్టు ద్వారా రక్షణ రంగానికి అవసరమైన అత్యాధునిక నౌకల నిర్మాణం ఇక్కడ జరగనుంది.

Also Read:IOCL: సంక్షోభం వేల భారీ శుభవార్త.. పుష్కలంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు.. వెల్లడించిన ఆయిల్ కంపెనీ..

ఈ ప్రాజెక్టు మొదటి దశలో సుమారు రూ.45 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 750 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మానవరహిత నౌకలు , అత్యాధునిక సాంకేతికతతో కూడిన యుద్ధ నౌకల తయారీకి ఈ కేంద్రం చిరునామాగా మారబోతోంది.

Also Read:House Tax: ఏందయ్యా ఇది.. ఇంటి పన్ను కట్టలేదని గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లిన మున్సిపల్ సిబ్బంది..

శంకుస్థాపన సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఏపీని కేవలం ఐటీ రంగంలోనే కాకుండా.. తయారీ, రక్షణ రంగాల్లో కూడా దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి.. ప్రపంచ స్థాయి నౌకల తయారీని ఇక్కడి నుంచే ప్రారంభించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. జువ్వలదిన్నె పోర్ట్ ఆధారంగా ఈ ప్రాంతం రానున్న రోజుల్లో భారీ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందనుంది.