NTV Telugu Site icon

Nara Lokesh : బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించ‌దు

Nara Lokesh

Nara Lokesh

బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన జనవరి 27న గుండెపోటుకు గురైనప్పటి నుండి గత 23 రోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే.. తారాకరత్న మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌ స్పందిస్తూ.. ‘బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించ‌దు. నేనున్నానంటూ నా వెంట న‌డిచిన ఆ అడుగులు చ‌ప్పుడు ఆగిపోయింది. నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటు. నిష్కల్మష‌మైన నీ ప్రేమ‌, స్నేహ బంధం మ‌న బంధుత్వం కంటే గొప్పది.

Also Read : NandamuriTarakaRatna: శివరాత్రి రోజునే శివైక్యం చెందిన నందమూరి హీరో

తార‌క‌ర‌త్నకి క‌న్నీటి నివాళులతో..’ అని ఆయన సంతాపం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. తార‌క‌ర‌త్న మృతితో నారా లోకేష్ యువగళం పాద‌యాత్ర‌కి బ్రేక్ వేసినట్లు వెల్లడించారు. నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతితో టీడీపీ యువ‌గ‌ళం పాద‌యాత్రకి విరామం ప్రకటించారు. తార‌క‌ర‌త్న‌కి నివాళులు అర్పించేందుకు లోకేష్ రేపు ఉదయం హైద‌రాబాద్ బ‌య‌లుదేరనున్నారు.

Also Read : SOT Raids : బర్డ్‌బక్స్‌, హాట్‌కప్‌ పబ్‌లపై కేసు నమోదు.. ఏడుగురి అరెస్ట్‌