Helpline Number: నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ చిక్కుబడిపోయిన ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి రాష్ట్ర విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ శ్రమిస్తున్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కార్యాలయంలో బుధవారం అధికారులు, మంత్రులు సమీక్ష నిర్వహించి పరిస్థితిని సమగ్రంగా చర్యలు చేపడుతున్నారు. సమస్యపై ప్రాథమిక సమాచారం అందించిన అధికారులు, నేపాల్‌లోని వివిధ ప్రాంతాల్లో సుమారు 241 మంది తెలుగువారూ చిక్కుకుపోయారని తెలిపారు.
Nara Lokesh: ఖాట్మండులో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తాం..!
సమాచారం ప్రకారం వివిధ ప్రాంతాల్లో తెలుగు వారు చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. మంత్రి లోకేష్ వారి కోసం ఖాట్మండ్ నుంచి విశాఖకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. వెంటనే బాధితులను రక్షించి, అత్యవసర సహాయం అందించడంలో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రతి రెండు గంటలకు బాధితుల క్షేమ పరిస్థితిని తెలుసుకోవాలని అధికారులకు ఆయన స్పష్టమైన సూచనలు చేశారు.
Digital Arrest Scam: ఏకంగా ఎమ్మెల్యేనే ముంచేశారు కదరా.. రూ.31 లక్షలు స్వాహా చేసిన స్కామర్లు!
ఇవి కాకుండా, నేపాల్ లో చిక్కుకున్న ఎపి వాసుల సహాయార్థం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయబడింది. ఏపీలోని వారు అత్యవసర సహాయానికి +91 9818395787, APNRTS 24/7 హెల్ప్‌లైన్ నంబర్ 0863-2340678, వాట్సాప్ నంబర్ +91 8500027678, helpline@apnrts.com, info@apnrts.com ఈ-మెయిల్స్ ద్వారా సంప్రదించవచ్చని అధికారులు తెలియజేశారు.
అలాగే, ఖాట్మండ్‌లో భారత రాయబారి కార్యాలయంలోనూ సహాయ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. +977-980 860 2881, +977-981 032 6134 నంబర్ల ద్వారా సాధారణ కాల్స్‌తో పాటు వాట్సాప్ ద్వారా కూడా సహాయం అందుబాటులో ఉందని ఆయన అధికారులు తెలిపారు. ఈ చర్యల ద్వారా తెలుగువారిని త్వరగా, సురక్షితంగా ఇండియాకు రాబట్టేలా చర్యలు కొనసాగుతున్నాయి.
