NTV Telugu Site icon

Nara Family: చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ రద్దు..

Chandrababu

Chandrababu

Nara Family: రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబును ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులు కలుస్తారని ముందుగా వార్తలు వచ్చాయి.. చంద్రబాబుతో ముగ్గురు కుటుంబ సభ్యులు ములాఖత్ అవుతారని.. నారా భువనేశ్వరితో పాటు లోకేష్, బ్రాహ్మణిల ములాఖత్‌లో చంద్రబాబును కలుస్తారని ముందుగా చెప్పారు.. అయితే, తాజా సమాచారం ప్రకారం.. చంద్రబాబుతో ఈ రోజు కుటుంబ సభ్యుల ములాఖత్ రద్దు అయ్యింది.. రేపు అనగా మంగళవారం రోజు చంద్రబాబుని ఆయన కుటుంబ సభ్యులు కలుస్తారని తెలుస్తోంది.. అయితే, రాజమండ్రికి చేరుకుంది నారా లోకేష్‌ చేపట్టిన యువ గళం పాదయాత్ర బస్సు.. బస్సులోనే అందుబాటులో ఉన్న ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో లోకేష్‌ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. చంద్రబాబు అరెస్టు తర్వాత జరుగుతున్న పరిణామాలపై నేతలతో చర్చిస్తున్నారు లోకేష్..

ఇక, భువనేశ్వరి, బ్రహ్మిణి రాకపై తమకు సమాచారం లేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతుండగా.. ములాఖత్ అనుమతులు అడిగిన తర్వాత తమకు సమాచారం లేదంటున్నారు జైలు అధికారులు.. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు లోకేష్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందంటున్నారు.. చంద్రబాబు అరెస్ట్.. ఆ తర్వాత పరిస్థితులపై ఆయన స్పందించే అవకాశం ఉంది. మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు హౌస్‌ అరెస్ట్ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి.. హౌస్‌ అరెస్ట్‌కు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా.. హౌస్‌ అరెస్ట్ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.. ఏఏజీ అందుబాటులో లేరని, సమయం ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు సిట్ స్పెషల్ జీపీ.. ఇప్పుడు వాదనలు కొనసాగుతున్నాయి.. మరోవైపు.. బెయిల్ పిటిషన్ సిద్ధం చేసిన చంద్రబాబు న్యాయవాదులు.. ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయనున్నారు గింజు పల్లి సుబ్బారావు.. హౌస్ అరెస్ట్ పిటిషన్ విచారణ తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు చంద్రబాబు తరపు న్యాయవాదులు.