NTV Telugu Site icon

Devansh: చదరంగంలో సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ ప్రపంచ రికార్డు

Nara Devansh

Nara Devansh

Devansh: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్‌లో ప్రపంచ రికార్డును సృష్టించారు. వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. దీంతో 9 ఏళ్ల నారా దేవాన్ష్ “వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్” ప్రపంచ రికార్డును సాధించాడు. ఈ క్రమంలో ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి అధికారిక ధృవీకరణను అందుకున్నాడు. నారా దేవాన్ష్ ఈ ఘనత సాధించడంతో నారా ఫ్యామిలీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా.. నారా దేవాన్ష్ ఇటీవల మరో రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. సెవెన్‌ డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం ఒక్క నిమిషం 43 సెకన్లలో పూర్తి చేశాడు. అలాగే తొమ్మిది చెస్‌బోర్డులను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను వేగంగా సరైన స్థానాల్లో ఉంచి రికార్డును సాధించాడు.

Read Also: Bandi Sanjay: కిమ్స్ ఆస్పత్రిలో శ్రీ తేజ్‌ను పరామర్శించిన కేంద్రమంత్రి..

దేవాన్ష్‌ ఈ ఘనత సాధించడం పట్ల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. దేవాన్ష్ లేజర్ షార్ప్‌ ఫోకస్‌లో శిక్షణ పొందడం ప్రత్యక్షంగా చూశానన్నారు. దేవాన్ష్‌ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించాడని.. గ్లోబర్‌ అరేనాలో ఇండియన్ చెస్ ఛాంపియన్స్‌ నుంచి ప్రేరణ పొందాడని చెప్పాడు. ఈ ఈవెంట్ కోసం గత కొన్ని వారాలుగా రోజుకు 5 నుంచి 6 గంటలు శిక్షణ పొందినట్లు నారా లోకేష్ చెప్పారు. చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. దేవాన్ష్‌ ఓ డైనమిక్ విద్యార్థి అని కోచ్ కె.రాజశేఖర్‌ రెడ్డి వెల్లడించారు.

చదరంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్‌ను రాష్ట్ర గృహా నిర్మాణం,సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారధి అభినందించారు. వేగంగా పావులు కదపడం, వేగవంతమైన చెక్ మేట్ సాల్వర్-175 పజిల్స్ సాధించిన దేవాన్ష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దేవాన్ష్ మరిన్ని విజయాలు సాధించాలని, ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎదిగి మన రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని మంత్రి ఆకాంక్షించారు.

సీఎం చంద్రబాబు ట్వీట్..

మంత్రి నారా లోకేష్ ట్వీట్..